హైదరాబాద్: ఐటీ ఉద్యోగులు ఎక్కువగా వుండే గచ్చిబౌలిలో ప్రాంతంలో ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది.  ఓ హోటల్ పై దాడిచేసిన పోలీసులు ఆరుగురు యువతులతో పాటు మరో ఆరుగురు విటులను  అదుపులోకి తీసుకున్నారు. అయితే నిర్వహకులు మాత్రం పోలీసులకు చిక్కకుండా పరారయ్యారు. 

ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా ఈ వ్యభిచారం సాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి యువతులను రప్పించి ఐటీ ఉద్యోగులకు ఆకర్షించి ఈ గలీజ్ దందా సాగిస్తున్నట్లు వెల్లడించారు.  కొండాపూర్‌ శ్రీరాంనగర్‌ కాలనీలోని ఓ హోటల్‌ ను అడ్డాగా చేసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో యాంటీ ఉమెన్‌ ట్రాకింగ్‌ సెల్ తో కలిసి హోటల్ పై దాడి చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. 

ఈ దాడిలో పశ్చిమ బెంగాల్ కు చెందిన ముగ్గురు, ముంబైకి చెందిన ఇద్దరు, డిల్లీకి చెందిన ఓ యువతి పట్టుబడ్డారు. వీరిని రెస్క్యూ హోం కు తరలించారు. ఇక విటులు బిజ్యూ పాయల్‌(27), దీపక్‌ కుమార్‌(25), సంగం కిషోర్‌దాల్‌(24), ఆరుట్ల నిఖిల్‌ (31), బంది నారాయణ (38), వెంకటేష్‌ గౌడ్‌(58)లను అరెస్ట్‌ చేశారు.  రూ.32,510 నగదుతో పాటు ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే నిర్వాహకులు ప్రభాకర్, సంజయ్, అజయ్‌ లు మాత్రం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు.