Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్, చెన్నైల్లో మసాజ్ ముసుగులో వ్యభిచారం, పట్టుకున్న టాస్క్ ఫోర్స్.. నిందితుల్లో 2 ఇన్ స్పెక్టర్లు.. !

మసాజ్ కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి దాడులు జరిపారు. మసాజ్ సెంటర్ నిర్వాహకలుతో పాటు ఒక విటుడు, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు నిందితులను అప్పగించారు. 

prostitution in the name of spa and saloon in hyderabad, chennai, task rorce police busted
Author
Hyderabad, First Published Nov 23, 2021, 10:07 AM IST

హైదరాబాద్ : మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ సెంటర్ మీద టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఒక విటుడిని, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. Task Force Police తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో కొందరు ‘ఎలిగంట్ బ్యూటీ స్పాలూన్, అథర్వ హమామ్ స్పా’ పేర్లతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. 

అయితే, ఈ కేంద్రాల్లో Prostitution నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి Attacks జరిపారు. మసాజ్ సెంటర్ నిర్వాహకలుతో పాటు ఒక విటుడు, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు నిందితులను అప్పగించారు. 

భువనగిరి జిల్లాలో దారుణం... ఆకతాయి వేధింపులకు మైనర్ బాలిక బలి

చెన్నైలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. చెన్నై నగరంలో అనుమతులు లేకుండా సాగుతున్న Massage centers పోలీసులు సీజ్ చేశారు. మసాజ్ సెంటర్లు, స్పాలలో వ్యభిచారం జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో వ్యభిచార నియంత్రణ విభాగంలో పనిచేసిన ఇద్దరు ఇన్ స్పెక్టర్లు ACBకి చిక్కారు. మసాజ్ సెంటర్లు, స్పాలు, స్టార్ హోటళ్ల నుంచి వీరు లక్షల్లో లంచం తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రత్యేక బృందాలు రెండు రోజులుగా మసాజ్ సెంటర్లు, స్పాల మీద దృష్టి పెట్టాయి. 

ఎనిమిది మసాజ్ సెంటర్లు ఇతర రాష్ట్రాల నుంచి యువతులు, మహిళలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. 8 మంది మహిళలకు విముక్తి కల్పించారు. నగరంలో మొత్తం 151 మసాజ్ సెంటర్లు, స్పాలు ఉండగా ఇందులో 63 సెంటర్లకు అనుమతులు కూడా లేవని తేలింది. ఈ సెంటర్లను సీజ్ చేశారు. నిర్వాహకుల మీద కేసులు నమోదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios