Asianet News TeluguAsianet News Telugu

మసాజ్ ముసుగులో వ్యభిచారం...హైదరాబాద్ లో పట్టుబడ్డ యువతులు

మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం సాగిస్తున్న ఓ స్పా పై హైదరాబాద్ పోలీసులు దాడిచేసారు. 

 

Prostitution in massage center at Hyderabad AKP
Author
First Published May 14, 2023, 11:44 AM IST

హైదరాబాద్ : మసాజ్ సెంటర్ ముసుగులో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా హైదరాబాద్ పోలీసులకు పట్టుబడింది. వివిధ ప్రాంతాలనుండి మసాజ్ థెరపిస్టుల పేరిట  అమ్మాయిలను తీసుకువచ్చి ఓ అపార్ట్ మెంట్ ప్లాట్ లో గుట్టుగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ వ్యభిచార దందాపై సమాచారం అందుకున్న పోలీసులు ప్లాట్ పై దాడిచేసి అమ్మాయిలను అదపులోకి తీసుకున్నారు. 

హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్ నంబర్ 9 లో అలివర్ స్పా పేరుతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు సోమా కమల్. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు అతడు క్రాస్ మసాజ్ పేరిట విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహస్తున్నాడు. వివిధ ప్రాంతాల నుండి అమ్మాయిలను తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నాడు. ఇలా స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచార కార్యకలాపాల కోసం  సుమంత్ అనే యువకున్ని మేనేజర్ గా నియమించుకున్నాడు. 

ఈ వ్యభిచార దందాపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు స్పా సెంటర్ పై దాడిచేసారు. ఇందులో వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్దారించుకుని నిర్వహకుడు, మేనేజర్ పై కేసులు నమోదు చేసారు. అలాగే స్పా సెంటర్ ను సీజ్ చేసారు. స్పా సెంటర్లో పనిచేసే యువతులను రెస్క్యూ హోం కు తరలించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios