ఆదిలాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్..పరారీలో నిర్వాహకురాలు..
పేద మహిళలను మభ్యపెట్టి..వారి అవసరాలే ఆసరాగా వ్యభిచారంలోకి దింపుతున్న ఓ మహిళ నిర్వహిస్తున్న గృహం మీద పోలీసులు దాడి చేశారు.

ఆదిలాబాద్ : మహిళలను అక్రమంగా రవాణా చేయడం.. వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపడం.. ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని మభ్యపెట్టడం..తరచుగా వెలుగులోకి వస్తున్న ఘటనలు. వీటిమీద పోలీసులు, ప్రభుత్వాలు ఉక్కుపాదాలు మోపినా మహిళల్ని వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాలు అక్కడక్కడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ లో ఇలాంటి ఘటన వెలుగు చూసింది.
ఆదిలాబాద్ న్యూహౌజింగ్ బోర్డు కాలనీలో ఇలాంటి ఉదంతమే పోలీసులు బట్టబయలు చేశారు. ఇక్కడ గత 15 రోజులుగా మమత అనే మహిళ వ్యభిచార కార్యకలాపాలు చేస్తోంది. పేద మహిళల అవసరాల్ని ఆసరాగా తీసుకుని ఈ దారుణానికి ఒడిగడుతోంది. చుట్టుపక్కల ఉండేవారిని గుర్తించి.. వారికి డబ్బుల ఆశ చూపి వ్యబిచారం చేయిస్తోంది.
ఈ మేరకు ఈ బుధవారం ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు న్యూహౌజింగ్ బోర్డు కాలనీలో సదరు మహిళ అద్దెకుంటున్న ఇంటిమీద దాడి చేశారు. ఈ రైడ్ లో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిని, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దాడి విషయం గమనించిన సదరు మహిళ మమత అక్కడినుంచి పరారయ్యింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాల్సిందే: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిగ్విజయ్ సింగ్ వార్నింగ్
ఇదిలా ఉండగా, డిసెంబర్ 1న హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లాలో ఇద్దరిపై పిడి యాక్ట్ నమోదయింది. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ లోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వీరు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈమేరకు సమాచారం అందడంతో రాచకొండ పోలీసులు దాడి చేశారు. వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వీరి మీద పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మీర్ పేట పోలీసులు వీరి మీద పీడీయాక్ట్ నమోదు చేశారు. నిందితుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా ఎల్లంపేటకు చెందిన గంధ భవానీ (25), గోదావరి జిల్లా అన్నవరానికి చెందిన కసిరెడ్డి దొరబాబులు (23)గా గుర్తించారు. వీరిద్దరూ స్నేహితులు. వీరిద్దరూ కలిసి మీర్‌పేట టీకేఆర్ కాలేజీ దగ్గర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఆ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
ఈజీగా, ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలని, విలాసవంతమైన జీవితం గడపాలని వీరి కోరిక. దీని కోసం ఇతర ప్రాంతాల నుంచి కూడా మహిళలను రప్పించి, అక్రమ రవాణా చేసి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈమేరకు మీర్పేట్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్టోబర్ 13వ తారీఖున ఆ ఇంటిపై దాడి చేశారు. వ్యభిచార గృహ నిర్వాహకులను కసిరెడ్డి దొరబాబు, గంధ భవానిలను అరెస్టు చేశారు. వీరి చెరలో ఉన్న ఇద్దరు మహిళలను విడిపించారు. వీరు నగరానికి చెందినవారిగా గుర్తించారు. మీరు మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండాలని సీపీ ఆదేశాల మేరకు వీరిద్దరి మీద పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఆ తర్వాత అక్కడినుంచి జైలుకు తరలించారు.