లాడ్జీలో గుట్టుగా వ్యభిచారం.. ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు అరెస్ట్...
లాడ్జీలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. దీంతో ఇద్దరు మహిళలు సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : హైదరాబాద్ లో రోజురోజుకు వ్యభిచార ముఠాల దందాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ లాడ్జీలో వ్యభిచారం చేయిస్తున్న లాడ్జీ యజమానితో పాటు ఐదుగురిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ ఎదురుగా కర్నాటి రామారావు అనే వ్యక్తి శ్రీ వెంకటేశ్వర లాడ్జీని నిర్వహిస్తున్నాడు. రిసెప్షనిస్టుగా యడ్డ సహదేవ్ పని చేస్తున్నాడు. సెక్స్ వర్కర్లను నియమించుకుని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులు ఆదివారం రాత్రి వెంకటేశ్వర లాడ్జీపై దాడి చేసి తనికీలు చేపట్టారు. ఈ సోదాల్లో విటులు దేవరాజు, మాణిక్ స్వరూప్, కర్నూల్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ, నల్గొండ జిల్లా డిండికి చెందిన మరో మహిళ పట్టుబడ్డారు. లాడ్జీ నిర్వాహకులు కర్నాటి రామారావు, సహదేవ్ ను కూడా అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు.
పొలంలో చలిమంట.. షెడ్డుకు మంటలంటుకుని రైతు సజీవదహనం..
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 22న ఇలాంటి ముఠానే కామారెడ్డి జిల్లాలో పట్టుబడింది. కామారెడ్డిజిల్లా గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో బయటపడిన దంపతుల ఆకృత్యాలను ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన దంపతులు వీరమల్లు రమేశ్, యశోద తాగుడుకు బానిసై దొంగతనాలు చేసేవారు. ఫంక్షన్ హాళ్లలో మహిళల సెల్ ఫోన్లు, ఆభరణాలు, నగదు దొంగిలించేవారు. ఇలా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ఓ ఫంక్షన్ హాల్ లో చోరీ చేస్తూ దొరకడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ తర్వాత జంగంపల్లి నుంచి కామారెడ్డికి మకాం మార్చిన దంపతులు పలువురు మహిళలతో వ్యభిచారం చేయించడం మొదలు పెట్టారు. అత్యాశతో వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో నివసించే నరేష్ సాయంతో జూలై 5న ప్రమీల అనే మహిళను పిలిపించారు. మద్యం తాగించి మత్తులో ఉండగా ఆమె గొంతు నులిమి హత మార్చారు. ఆమె నుంచి రూ. 30వేల నగదు, బంగారం, వెండి ఆభరణాలను తీసుకున్నారు. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి కారులో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి పెట్రోల్ పోసి కాల్చివేశారు. ఈ నెల 7న వాణి అనే మహిళను ఇదేవిధంగా పిలిపించి హత్య చేశారు. మృతదేహాన్ని కారులో గాంధారి మండలం తిమ్మాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి డీజిల్ తో దహనం చేశారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. దాని యజమానిగా భావిస్తున్న వీరమల్లు రమేష్ ను పట్టుకుని విచారించగా బండారం బయటపడింది. అతడి భార్య యశోద, వారి వద్ద బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన పిన్నోజి రామును అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి రెండు కార్లు, ద్విచక్ర వాహనం, మూడు సెల్ ఫోన్ లతో పాటు రూ.5వేల నగదు, తులంన్నరకు పైగా బంగారం, 40 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమీల హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న నరేష్ కోసం గంభీరావుపేట పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.