Asianet News TeluguAsianet News Telugu

హోటల్ లో గుట్టుగా వ్యభిచారం.. ఐదుగురి అరెస్ట్..

హోటల్ లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. 

Prostitution in a hotel in gachibowli, five arrested
Author
First Published Nov 21, 2022, 1:59 PM IST

హైదరాబాద్ : వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేసిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోనె సురేష్ కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. రాఘవేంద్ర కాలనీలోని వైట్ హౌస్ లో ఓ హోటల్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సభ్యులు హోటమ్ మీద దాడి చేశారు. 

ఈ సందర్భంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. నిర్వహకులు మహ్మద్ అదీమ్, మహ్మద్ సమీర్, హర్బిందర్ కౌర్ అలియాస్ అనికా, మహ్మద్ సల్మాన్, మహ్మద్ అబ్దుల్ కరీంలను అరెస్ట్ చేశారు. మహ్మద్ అదీమ్ పలు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యబిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిందితులమీద సైబరాబాద్ లో పదికేసులు నమోదైనట్లు ఆయన వివరించారు. 

అర్థరాత్రి నీటి సంపులో పడేసి రెండు నెలల పసికందు హత్య... కుటుంబసభ్యులపై అనుమానం...

ఇదిలా ఉండగా, నవంబర్ 17న పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని మసాజ్ సెంటర్లో వ్యభిచారం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను భీమవరం రెండో పట్టణ సీఐ బిజ కృష్ణకుమార్ బుధవారం వెల్లడించారు. పట్టణ పరిధిలో చినఅమిరం వద్ద తమ్మిరాజు నగర్ లో నిర్వహిస్తున్న లావిష్ బ్యూటీ అండ్ స్పాలో వ్యభిచారం జరుపుతున్నట్లు స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ ఆకుల రఘుకు సమాచారం అందింది. దీంతో మంగళవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి ఈ కేంద్రంలో వ్యభిచారం చేయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు.

ఈ కేంద్ర నిర్వాహకులైన భీమవరం కొవ్వాడపుంతకు చెందిన యువకుడు ఇంగువ శివసురేష్, విజయవాడకు చెందిన మాంధతి మాధవ్, హైదరాబాదులోని బోరబండకు చెందిన గడ్డం వినోద్ కుమార్ లను పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి రూ.96వేల నగదు, 10 సెల్ ఫోన్ లు, కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు అయినా నరసాపురానికి చెందిన సత్యదేవ, విశాఖపట్నం వాసి ప్రతాప్ లను అరెస్ట్ చేయాల్సి ఉందని సీఐ తెలిపారు. తనిఖీల సమయంలో విజయవాడ, హైదరాబాద్ లకు చెందిన నలుగురు మహిళలను గుర్తించి ఆ ముఠా బారి నుంచి రక్షించినట్లు తెలిపారు. 

కాగా, అక్టోబర్ 18న విజయవాడ నగరంలోని స్పాలు, మసాజ్ సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారంతో పోలీసులు ఏకకాలంలో పలు స్పా, మసాజ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించి 19 కేంద్రాలను సీజ్ చేశారు. ఈ వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ డీసీపీ విశాల్ గున్ని వెల్లడించారు. విజయవాడలో  200కు పైగా స్పా, మసాజ్ సెంటర్లు ఉన్నాయని  డీసీపీ తెలిపారు. కొన్ని స్పా, మసాజ్, ఫిట్నెస్, వెల్ నెస్, స్లిమ్మింగ్, హెల్త్ సెంటర్లలో హైటెక్ వ్యభిచారం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు.  ఆయా సెంటర్లపై వారంరోజులుగా నిఘా పెట్టామని అన్నారు. ఈ సెంటర్లలో 20 ప్రత్యేక పోలీసు బృందాలతో గతరాత్రి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించగా, 19 కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios