Asianet News Telugu

గుట్టు రట్టు: చదువుల పేరుతో హైదరాబాద్ వచ్చి, వ్యభిచారం...

చదువు కోసమని వచ్చి హైదరాబాదులో వ్యభిచారం చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ పోలీసు స్టే,న్ పరిధిలో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

Prostitution gang arrested in Hyderabad by Rachakonda police
Author
Neredmet, First Published Jun 29, 2021, 6:55 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: ఓ వ్యభిచారం గుట్టును హైదరాబాదు పోలీసులు రట్టు చేశారు. అత్యంత రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు విదేశీ వనితలను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నేరేడుమెట్టులో డెకాయి ఆపరేషన్ నిర్వహించి వారిని అరెస్టు చేశారు.

టాంజానియాకు చెందిన డయానా (24), కాబాంగిలా వారెన్ (24)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డయానా, వారెన్ స్టడీ వీసాపై నిరుడు జనవరిలో హైదరాబాదు వచ్చారు. రెండు నెలల క్రితం నేరెడుమెట్టుకు మకాం మార్చారు.

భార్యాభర్తలమని చెప్పి గదిని అద్దెకు తీసుకున్నారు. మీట్ 24 యాప్ లో డయానా తన పేరును నమోదు చేసుకుంది. కస్టమర్లను ఇంటికి అహ్వానిస్తూ వచ్చింది. తమకు అందిన సమాచారంతో మల్కాజిగిరి ఎస్వోటీ, నేరేడుమెట్టు పోలీసులు సంయుక్తంగా ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు. 

దాడి చేసి వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి పాస్ పోర్టులను, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీసా గడువు ముగిసినా కూడా వారు హైదరాబాదులో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios