హైదరాబాద్: విరసం కార్యదర్శి కాశీం ను గజ్వేల్ పోలీసులు  ఆదివారం నాడు ఉదయం తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు హాజరుపర్చారు.

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కాశీం అరెస్ట్‌ను నిరసిస్తూ  చీఫ్ జస్టిస్‌ ఇంటికి సమీపంలో ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాల నేతలు ఆందోళన చేశారు.  2016లో నమోదైన కేసులో గజ్వేల్ పోలీసులు ఈ నెల 18వ తేదీన అరెస్ట్ చేశారు.

Also read:విరసం కార్యదర్శి కాశీం అరెస్టు: హైకోర్టుకు వెళ్తామన్న భార్య

దీంతో కాశీం అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కాశీం భార్య హేమలత  హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ను ఈ నెల 18వ తేదీన దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 19వ తేదీ ఉదయం తన ముందు కాశీంను హాజరుపర్చాలని ఆదేశించింది.

Also Read: ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసు సోదాలు

ఈ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా జైలు నుండి  కాశీం ను తెలంగాణ చీఫ్ జస్టిస్ ముందు హాజరుపర్చారు. తెలంగాణ చీఫ్ జస్టిస్ ఇంట్లో  ప్రభుత్వ తరపున, పిటిషనర్ తరపున లాయర్లు వాదిస్తున్నారు.