హెడ్ మాస్టర్ నిర్వాకం: 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేశాడు

Principal of Shamshabad government school kidnaps, rapes 17-year-old
Highlights

బుద్ధులు చెప్పాల్సిన గురువే నీచానికి ఒడిగట్టాడు. బాలికపై కన్నేసిన అక్బర్ అలీ (45) అనే స్కూల్ హెడ్ మాస్టర్ పరీక్షలు పాస్ చేయిస్తానని నమ్మించి, అత్యాచారానికి ఒడిగట్టాడు.

హైదరాబాద్: బుద్ధులు చెప్పాల్సిన గురువే నీచానికి ఒడిగట్టాడు. బాలికపై కన్నేసిన అక్బర్ అలీ (45) అనే స్కూల్ హెడ్ మాస్టర్ పరీక్షలు పాస్ చేయిస్తానని నమ్మించి, అత్యాచారానికి ఒడిగట్టాడు. 

బాలికను తన వెంట తీసుకుని వెళ్లి పెళ్లి చేసుకున్ాడు. ఆ తర్వాత ఆమెపై పదే పదే అత్యాచారం చేశాడు. ఏడో తరగతి నుంచి ఆ బాలికకు అతను ప్రేమ పాఠాలు నేర్పాడు. పాఠశాల నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆరేళ్లుగా ఆమె వెంట పడ్డాడు. 

ఇంటర్మీడియట్ బోర్డులో తనకు తెలిసిన వారున్నారని, ఇంటర్ పాస్ చేయిస్తానని బాలికను నమ్మించాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో మహ్మద్ అక్బర్ అలీ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బాలిక ఏడో తరగతి వరకు ఆ పాఠశాలలో చదివింది. 

ఈ ఏడాది ఇంటర్ పరీక్షల్లో బాలిక ఓ సబ్జెక్టులో తప్పింది. దాంతో అక్బర్ పాస్ చేయిస్తానంటూ 20 రోజుల క్రితం తన వెంట తీసుకుని వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత షాబాద్ తీసుకుని వెళ్లాడు. 

విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు శంషాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ లో మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. 

loader