Amnesia Pub Rape Case : కస్టడీకి ఏ-1 సాదుద్దీన్.. సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు..

అమ్నీషియా పబ్ రేప్ కేసులో ఏ1గా ఉన్న సాదుద్దీన్ మాలిక్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నాలుగురోజుల కస్టడీలో సీన్ రీకన్ స్ట్రక్షన్ కూడా చేయనున్నారు. 

police take A1 saduddin malik into a custody in jubilee amnesia pub rape case

హైదరాబాద్ :  Jubileehillsలో బాలికపై gang rape కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కేసులో ఏ-1గా ఉన్న Saduddin Malikను చంచల్గూడ జైలు నుంచి Police custodyలోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని పోలీసులు గతంలో కోరిన సంగతి తెలిసిందే.  దీంతో నేటి నుంచి ఈనెల 12వ తేదీ వరకు కస్టడీకి కోర్టు అనుమతించింది. సాదుద్దీన్ మాలిక్ ను ప్రశ్నిస్తే మరికొన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్న పోలీసులు.. అత్యాచార ఘటనను Sean Reconstruction చేయనున్నారు. పబ్లో బాలికను డ్రాప్ చేసిన అంశాల పైనా విచారించనున్నారు.

ఈ కేసులో ఇప్పటికే  పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఐదుగురు మైనర్లు కాగా సాదుద్దీన్ మాలిక్ ఒక్కడే మేజర్.  మిగిలిన ఐదుగురు మైనర్ల కస్టడీ కోరుతూ మంగళవారం జువైనల్ కోర్టు లో  పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు  కుటుంబ సభ్యులు బుధవారం జువైనల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 

కాగా,  ‘జూబ్లీహిల్స్ లో Amnesia Pub కు స్నేహితులతో కలిసి వెళ్లిన బాలికపై gang rape చేసిన నిందితులు.. అంతకు ముందు ఆమె వస్తువులు లాక్కుని.. పథకం ప్రకారం దిగ్బంధించారు. పబ్ లోపలికి వెళ్లేందుకు వీలుగా యాజమాన్యం ఇచ్చిన tagలు ఆమెకు తెలియకుండా తెంచేశారు. ఆమె మళ్లీ pub లోకి వెళ్లలేని పరిస్థితి కల్పించారు. ఆమెను ఇంటి దగ్గర దింపుతామంటూ బెంజ్ కారులో ఎక్కించుకున్నారు’.. జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ వివరాలు పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. 

మే 28న అత్యాచార ఘటన  తర్వాత  జూన్ 2న భరోసా కేంద్రంలో బాధితురాలితో ఓ మహిళా పోలీస్ అధికారి మాట్లాడారు. ‘నాకు నిందితులెవరూ పరిచయం లేరు. నా స్నేహితురాలు ఇంటికి వెళ్తాను అంటే మేము ఇద్దరం బయటకు వచ్చాం. ఆమె క్యాబ్లో వెళ్ళిపోయింది. మాతో పాటు నలుగురు నిందితులు వచ్చారని’ బాధితురాలు చెప్పినట్లు తెలిసింది.

క్యాబ్ బుక్ చేస్తామని నటిస్తూ…
మే 28, సాయంత్రం పబ్ నుంచి బయటికి వచ్చిన బాలిక ఇంటికి వెళ్లేందుకు.. పబ్ లో ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేస్తే.. అతడు సమాధానం ఇవ్వలేదు. పక్కనే ఉన్న నిందితులు క్యాబ్ బుక్ చేస్తామంటూ ఆమె ఫోన్ లాక్కున్నారు. మొబైల్ డేటా సరిగా లేదు.. మేము దింపుతాం అంటూ బెంజ్ కారులో ఆమెను ఎక్కించుకున్నారు. నిందితుల్లో ఒకరు ఆమె బ్యాగ్ కళ్ళజోడు తీసుకున్నాడు. బంజారాహిల్స్ వైపు కారులో వెళ్తుండగానే.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. కాన్సు బేకరీ వద్దకు వచ్చాక… ఈ కారు ఇరుకుగా ఉందని, మరో కారు వస్తుందని చెప్పారు. తన ఫోన్, కళ్ళజోడు, బ్యాగ్ ఇస్తే ఇంటికి వెళ్ళిపోతాను అని ఆమె బతిమాలినా వినలేదు.  బెదిరించి మరో కారులో తీసుకువెళ్లారు. 

చిరునామా తెలియక… వస్తువులు దొరక…
‘బేకరీ వద్ద ఇన్నోవాలో ఎక్కేందుకు 15 నిమిషాల వ్యవధి ఉంది. ఆ సమయంలో బయటికి వచ్చి ఎవరినైనా సహాయం అడగవచ్చు. ఎవరికైనా చెప్పి పోలీసులకు ఫోన్ చేయించవచ్చు కదా’ అని ఆ అధికారిని బాలిక వద్ద  ప్రస్తావించినట్లు సమాచారం. అది తనకు తెలియని ప్రాంతం కావడంతో ఏమి చేయలేక పోయానని బాధితురాలు చెప్పినట్లు తెలిసింది. పైగా తన కళ్ళజోడు, ఫోను, బ్యాగ్ తిరిగి ఇవ్వకపోవడంతో వాటికోసమే  తాను కారులోనే ఉన్నానని వివరించినట్లు సమాచారం.

కారు నడిపింది ఎవరు?
పబ్ నుంచి బంజారాహిల్స్ కాన్సు బేకరీ వరకు బెంజ్ కారును.. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితుల్లో చివరిగా పట్టుబడిన మైనర్ (16) నడిపినట్లు పోలీసులు గుర్తించారు. కారు నడిపిన అతడి మీద, కారు ఇచ్చిన కుటుంబసభ్యులపైన కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కారు ఆ బాలుడు తల్లి పేరుతో ఉన్నట్లుగా గుర్తించారు. బేకరీ నుంచి వెళ్లే సమయంలో ఇన్నోవా కారును ప్రభుత్వరంగ సంస్థ చైర్మన్ కుమారుడు నడిపినట్లు అనుమానిస్తున్నారు. సనత్ నగర్ కు చెందిన ఒక మహిళ పేరిట 2019లో కొన్ని ఇన్నోవా మూడేళ్లుగా తాత్కాలిక (టీఆర్) నెంబర్ తోనే ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ చైర్మన్ ఆ పదవిలోకి రాకముందే ఈ కారును వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. తర్వాత దాన్నే ‘ప్రభుత్వ వాహనం’ స్టిక్కర్లు అతికించి వాడుతున్నట్లు సమాచారం.

నాలుగు రోజుల కస్టడీకి సాదుద్దీన్…
జూబ్లీహిల్స్లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పుప్పాలగూడ కు చెందిన సాదుద్దీన్ మాలిక్ (18)ను ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు కస్టడీకి ఇవ్వడానికి కోర్టు అనుమతించింది. మిగిలిన ఐదుగురు మైనర్ల కస్టడీ కోరుతూ మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు మైనర్ల కుటుంబ సభ్యులు బుధవారం జువైనల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios