Asianet News TeluguAsianet News Telugu

బాలికను ట్రాప్ చేసిన యువతి.. ఆపై మందుబాబుల చేతికి : పాతబస్తీ గ్యాంగ్‌రేప్ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ పాతబస్తీ మైనర్ బాలిక గ్యాంగ్‌రేప్ కేసును పోలీసులు ఛేదించారు. బాధితురాలిని ఓ అమ్మాయి ట్రాప్ చేసి మందు బాబులకు అప్పగించినట్లుగా పోలీసులు గుర్తించారు. 
 

police solved gang rape case in hyderabad's old city
Author
First Published Feb 9, 2023, 5:39 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ పాతబస్తీ మైనర్ బాలిక గ్యాంగ్‌రేప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికకు మద్యం తాగించి , ఆమె మత్తులోకి జారుకున్నాక ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధితురాలిని ఓ అమ్మాయి ట్రాప్ చేసి మందు బాబులకు అప్పగించింది. అప్పటికే వీరంతా మద్యం, హుక్కా సేవించారని పోలీసులు తెలిపారు. బాలికను ట్రాప్ చేసిన అమ్మాయిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు ఇంటర్ విద్యార్ధులు కూడా వున్నట్లుగా తెలుస్తోంది. వీరిని రాహుల్, నితిన్, దీక్షిత్, మల్లేష్, పవన్, రాజ్ కుమార్‌లుగా గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios