జడ్చర్ల: జడ్చర్ల వ్యభిచార గృహంలో చిక్కుకొన్న ఓ బాలికకు పోలీసులు విముక్తి కల్పించారు. మైనర్ బాలికకు  మాయా మాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి  మార్చేందుకు ప్రయత్నించిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

హైద్రాబాద్‌ చైతన్యపురిలోని  ఎన్టీఆర్ నగర్  సమీపంలో మైనర్ బాలిక తల్లితో కలిసి నివాసం ఉంటుంది. అయితే ఆ బాలికకు చంటి అనే డ్రైవర్ అతని భార్య పుష్ప మాయా మాటలు చెప్పి  ఈ నెల 10వ తేదీన జడ్చర్లకు తీసుకెళ్లారు.

వ్యభిచారం చేయాలని  ఆ బాలికపై ఒత్తిడి తెచ్చారు. జడ్చర్లలో చంటి భార్య మరికొందరు మహిళలతో  వ్యభిచార గృహన్ని నిర్వహిస్తోంది.బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ నిర్వహించారు. ఈ విచారణలో చంటి మైనర్ బాలికను  జడ్చర్లకు తీసుకెళ్లారని  గుర్తించారు.

పోలీసులు జడ్చర్లలో చంటి నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేశారు. మైనర్ బాలికతో పాటు ఏడుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో చంటి భార్య కూడ ఉన్నట్టు పోలీసులు తెలిపారు.