హైదరాబాద్: భారతదేశంలో అక్రమంగా ఉండడమే కాకుండా వ్యభిచారం చేస్తున్న బంగ్లాదేశ్ యువతిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. బంగ్లాదేశ్ కు చెందిన యువతి మొయానా అక్టస అలియా మున్నీ షెండ్ 15 ఏళ్ల క్రితం భారతదేశం వచ్ిచంది. బ్యుటిషియన్ పేరుతో తనకు తెలిసినవారితో ఆమె భారతదేశంలో అడుగు పెట్టింది. 

ఆ తర్వాత హైదరాబాదులో ఉంటూ బ్యుటిషియన్ గా పనిచేస్తూ వచ్చింది. కొంత కాలం గార్మెంట్ వర్కర్ గా కూడా పనిచేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తనకు తెలిసిన బంగ్లాదేశ్ యువతుల సహకారంతో ఆన్ లైన్ సెక్స్ వర్కర్ గా పనిచేస్తోంది. సమాచారం అందుకు రాచకొండ యాంటీ హ్యూమన్ ట్రాఫికిం్గ యూనిట్ తో పాటు సరూర్ నగర్ పోలీసులు నిఘా పెట్ిట అక్టసనను అదుపులోకి తీసుకున్నారు. 

విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆమెపై గతంలో ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం పోలీసు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు. 15 ఏళ్ల క్రితం హైదరాబాదు వచ్చిన ఆమె నకిలీ ఓటరు కార్డును కూడా తయారు చేసుకుంది. పోలీసులు ఆ బంగ్లాదేశ్ యువతిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.