హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా వ్యవహారాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా రాచకొండ కమీషనరేట్‌ పరిధిలో ఆన్‌లైన్ కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సంఘటనా స్థలంలో వంశీ రెడ్డి అలియాస్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాన నిర్వాహకులు అంజలి, చిన్నాలు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠా బారి నుంచి నలుగురు యువతులను పోలీసులు రక్షించారు. వీరిలో ముగ్గురు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు కాగా..మరో యువతి స్వస్థలం విజయవాడగా పోలీసులు గుర్తించారు. 

Also Read:

హైటెక్ సెక్స్ రాకెట్... అమ్మాయిలతో దొరికిపోయిన జర్నలిస్ట్

హైదరాబాదులో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు: టెక్కీ సహా పట్టుబడిన నేత