Asianet News TeluguAsianet News Telugu

సెక్స్ రాకెట్: యాదగిరి గుట్ట వ్యభిచార నిర్వాహకుల ఇళ్లలో సొరంగాలు

చిన్నారులను కొనుగోలు చేసి వ్యభిచార వృత్తిలోకి  దింపే  ముఠా  పాల్పడిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. యాదాద్రి భువనగరి జిల్లా యాదగిరిగుట్టలో  ఆపరేషన్ ముస్కాన్ పేరుతో  పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. 

Police found tunnels in brothel houses in Yadagirigutta

యాదగిరిగుట్ట: చిన్నారులను కొనుగోలు చేసి వ్యభిచార వృత్తిలోకి  దింపే  ముఠా  పాల్పడిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. యాదాద్రి భువనగరి జిల్లా యాదగిరిగుట్టలో  ఆపరేషన్ ముస్కాన్ పేరుతో  పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. అయితే పోలీసులు సోదాలు నిర్వహించే సమయంలో వ్యభిచారంలోకి దింపే పిల్లలు పోలీసుల కంట పడకుండా ఉండేందుకు గాను  తమ ఇళ్లలో సొరంగాలను  ఏర్పాటు చేసుకొన్నారు.  తాజాగా గురువారం నాడు నిర్వహించిన సోదాల్లో  ఈ సొరంగాలను గుర్తించారు పోలీసులు.

యాదగిరి గుట్టలో చిన్నారులను వ్యభిచార వృత్తిలోకి దింపుతున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు వ్యభిచార నిర్వాహకులపై దాడులు కొనసాగిస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటికే 15 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు. పదేళ్లలోపు పిల్లలను త్వరగా పీరియడ్స్ వచ్చేలా ఈస్ట్రోజన్ హర్మోన్ ఇంజక్షన్లు  ఇప్పిస్తున్నారు. 

నిర్ణీత వయస్సు రాకపోయినా ఈ ఇంజక్షన్ల వల్ల చిన్నారుల్లో పీరియడ్స్  వస్తాయి.   అయితే చిన్నారులను వ్యభిచార కూపం నుండి కాపాడేందుకు గాను పోలీసు శాఖ ఆపరేషన్ ముస్కాన్ పేరుతో మూడు రోజులుగా యాదగిరిగుట్టలో  సోదాలు నిర్వహిస్తోంది.

ఇప్పటికే సుమారు 15 మంది చిన్నారులను రక్షించారు.  గురువారం నాడు నిర్వహించిన  సోదాల్లో  వ్యభిచార నిర్వాహకుల ఇళ్లలో సొరంగాలను గుర్తించారు.  తమ ఇళ్లలో ప్రత్యేకంగా సొరంగాలను ఏర్పాటు చేసుకొన్నారు.

ఓ వ్యభిచార గృహం నిర్వాహకురాలి ఇంట్లో మంచం కింద సొరంగాన్ని గుర్తించారు.  గోడకు సొరంగాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల సోదాలు జరిగే సమయంలో పిల్లలను మంచం కింద ఉన్న సొరంగం కిందకు పంపించి  అక్కడే ఉంచేవారు. పైనా యధావిధిగా మూసివేసేవారు.  మంచం కింద ఉన్న సొరంగాన్ని ఇవాళ పోలీసులు గుర్తించారు.  గుట్టలోని పలు  వ్యభిచార నిర్వాహకుల ఇళ్లలో ఈ తరహ  సొరంగాలను గుర్తించినట్టు డీసీపీ రామచంద్రారెడ్డి చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios