బాలికలను లైంగికంగా వేధిస్తూ వారికి నరకం చూపిస్తున్న ఓ టీఆర్ఎస్ నేత వెకిలిచేష్టలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇంటికి దూరంగా హాస్టల్ లో ఉంటున్న విద్యార్థినులను టార్గెట్ చేసుకొని ఓ టీఆర్ఎస్ నేత లైంగికంగా వేధించాడు. ఈ సంఘటన సిరిసిల్లలో చోటుచేసుకుంది. ‘రూ.1000 ఇస్తా. రాత్రికి వచ్చేయండి. లేదంటే మీ స్నేహితురాళ్లెవరికైనా చెప్పి ఒప్పించండి’ అంటూ వారిని వేధించడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సిరిసిల్లలోని ఎస్సీ హాస్టల్లో క్యాటరింగ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న దేవయ్య.. టీఆర్ఎస్ నేతగా వ్యవహరిస్తున్నాడు. రూ.వెయ్యి ఇస్తా నాతో పడుకుంటావా అంటూ వేధించేవాడు. బలవంతంగా వారికి పోర్న్ వీడియోలు చూపించేవాడు. కాగా.. అతడికి అక్కడ వంట మనిషిగా పనిచేస్తున్న విజయమ్మ సహకరించింది. దేవయ్య వెకిలిచేష్టలకు విద్యార్థినులు భోరుమంటే, ‘డబ్బులు ఇస్తానంటున్నాడు కదా?’ అంటూ దేవయ్యకు వత్తాసుగా మాట్లాడేది.

Also Read పోలీసులమని, లగేజ్ చెక్‌ చేయాలని చెప్పి: మహిళపై అత్యాచారం...

 దేవయ్య, విజయమ్మలను అదుపులోకి తీసుకున్నట్లు  పోలీసులు తెలిపారు. హాస్టల్‌ వార్డెన్‌ భూదేవిని సస్పెండ్‌ చేస్తూ జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. దేవయ్యను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రకటించారు.

జనగామలో మరో కీచకుడు వెలుగులోకి వచ్చాడు. యువతులను లైంగికంగా వేధించి.. వీడియోలు చూపించి బెదిరించేవాడు. సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న యువతుల ఫోన్‌ నంబర్లను సేకరించి ఫోన్‌ చేసేవాడు. రుణాలిప్పిస్తాడనే ఆశతో కాస్త చనువుగా మాట్లాడిన యువతులను నగ్న ఫొటోలు, వీడియోలు పంపాలంటూ లైంగికంగా వేధించేవాడు. దీంతో బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.