Asianet News TeluguAsianet News Telugu

వీడసలు తండ్రేనా.. కూతురిని రేప్ చేయిస్తానంటూ బెదిరించి..!

ఇల్లు వదిలి వెళ్లకుంటే.. అత్యాచారం చేస్తాయిస్తానంటూ కూడా బెదిరించాడు.  ఆమెతోపాటు.. ఆమె తల్లిని కూడా బెదిరించడం గమనార్హం. 
 

Police case against the man who threaten daughter in Banjarahills
Author
Hyderabad, First Published Aug 16, 2021, 9:58 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. ఓ కూతురి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఇల్లు వదిలి వెళ్లిపోవాలని లేదంటే... అత్యాచారం చేయిస్తామంటూ కూతురిని బెదిరించాడు. కాగా.. ఆ దుర్మార్గుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఓ ఎంఫిల్ విద్యార్థిని తన తండ్రి, తల్లి, సోదరుడితో కలిసి ఓ ఇంట్లో నివసిస్తోంది.  కాగా.. గత కొంతకాలంగా.. సదరు విద్యార్థినిని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలంటూ కన్న తండ్రి బెదిరిస్తూ రావడం గమనార్హం. ఇల్లు వదిలి వెళ్లకుంటే.. అత్యాచారం చేస్తాయిస్తానంటూ కూడా బెదిరించాడు.  ఆమెతోపాటు.. ఆమె తల్లిని కూడా బెదిరించడం గమనార్హం. 

ఈ క్రమంలోనే సదరు విద్యార్థినితోపాటు.. ఆమె తల్లిపై శనివారం దాడికి పాల్పడ్డాడు. విద్యార్థిని తల్లిపేరిట ఉన్న ఆస్తికి సంబంధించి అద్దెలు వసూలే చేసుకోవడంతోపాటు తమపై దాడికి పాల్పడుతున్నాడని.. ఇలా చేయడం కరెక్ట్ కాదని ప్రశ్నిస్తే.. అత్యాచారం చేయిస్తానని బెదిరిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios