భర్తతో గొడవ జరిగిన ఏ వివాహితకైనా పుట్టింటికే వెళుతుంది. ఎందుకంటే అక్కడ తనవారు ఉంటారని.. తనకు అండగా ఉంటారని భావిస్తారు. ఓ మహిళ కూడా అంతే భావించింది. భర్తతో గొడవ జరగడంతో.. ఆమె కూడా పుట్టింటికి చేరింది. అక్కడ సోదరుడు లాంటివాడు ఆమెను దారుణంగా మోసం చేశాడు. ఆమెను చిత్రహింసలకు గురిచేసి... అనంతరం వ్యభిచార కూపంలోకి దించాడు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలానికి చెందిన యువతి(21) కి గార్ల మండలానికి చెందిన వ్యక్తితో మూడేళ్ల కిందట పెళ్లైంది. వారికి రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. కూలిపనులు చేసుకుంటూ జీవించేవారు. ఎనిమిది నెలల కిందట దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో.. యువతి భర్త మీద కోపంతో పుట్టింటికి వెళ్లింది.

అక్కడ అదే ప్రాంతానికి చెందిన భూక్యా సర్వేశ్ అనే వ్యక్తి యువతి పుట్టింటికి వెళ్లి.. ఆమెను భర్త తీసుకురమ్ముంటున్నాడని నమ్మించాడు. భర్త పిలిచాడనగానే.. యువతి నిజమే అనుకొని సంబరపడిపోయింది. అప్పటికే సర్వేశ్ తో పరిచయం తో పరిచయం ఉండటంతో... గతంలో అన్న అని పిలిచి రాఖీ కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో.. అతనిని నమ్మి.. అతని వెంట వెళ్లింది.

అక్కడ ఆమెను చిత్ర హింసలకు గురిచేశాడు. ఆమె రెండేళ్ల కుమార్తెకు కూడా సిగరెట్లతో వాతలుపెట్టడం గమనార్హం.  పాపను చంపేస్తానని బెదిరించి ఆమె వద్ద ఉన్న నాలుగు తులాల బంగారం లాక్కున్నాడు. అనంతరం ఆమెకు మత్తుమందు ఇచ్చి  రోజుకి ఇంటికి నలుగురైదురిని పిలిపించి వ్యభిచారం చేయించడం మొదలుపెట్టాడు.

అయితే.. అతని వ్యవహారం తేడాగా అనిపించడంతో సర్వేశ్ లేని సమయంలో ఆ ఇంటి యజమాని తలుపులు పగలకొట్టి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యజమాని సహకారంతో అక్కడి నుంచి బయటపడిన యువతి పుట్టింటికి చేరింది. తల్లిదండ్రుల సహకారంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.