ఫంక్షన్ హాలులో ఎవరికీ అనుమానం రాకుండా.. వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టుని పోలీసులు రట్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఓ వైపు కరోనా వైరస్ తో ప్రజలు భయంతో చచ్చిపోతుంటే.. వీళ్లు మాత్రం వాళ్ల దందా కొనసాగిస్తున్నారు. కాగా.. ఈ దందాను ఎయిర్ పోర్ట్ పోలీసులు దాడులు నిర్వహించారు.

ఎయిర్ పోర్ట్ జోన్ ఎస్ .ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుచ్చిరాజు పాలెం వద్ద విష్ణు ప్రియా పంక్షన్ హాల్ లో వ్యబిచారం జరుగుతుందన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. అక్కడ ముగ్గురు మహిళలు , ఇద్దరు విటులతో పాటుగా పంక్షన్ హాల్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఆరు  సెల్ ఫోన్ లతో పాటుగా 8 వేల 180 రూపాయల నగదు ను  స్వాదీనం చేసుకొని కేసు నమోదు చేసామని తెలిపారు . ఈ దాడుల్లో ఎస్ .ఐ మహేశ్వరావు , సునీత సిబ్బంది పాల్గున్నారు