Asianet News Telugu

ఫాంహౌస్ లో వ్యభిచారం.. ప్రముఖులు కూడా..!

అమ్మాయిలను ఆ ఫాంహౌస్ కి రహస్యంగా తరలించి.. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు జర్నలిస్టులకు సమాచారం అందింది. 

police burst sex rocket in medak
Author
Hyderabad, First Published Jul 19, 2021, 9:43 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఫాంహౌస్ లో రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 14మంది పోలీసులకు చిక్కగా.. పలువురు ప్రముఖులు తప్పించుకోవడం గమనార్హం. ఈ సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెంటక్రావ్ పేట గ్రామ సమీపంలోని ఓ ఫాంహౌస్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అమ్మాయిలను ఆ ఫాంహౌస్ కి రహస్యంగా తరలించి.. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు జర్నలిస్టులకు సమాచారం అందింది. దీంతో.. వారు పోలీసులకు తెలియజేయడంతో... స్థానిక పోలీసులు శనివారం అర్ధరాత్రి ఫాంహౌస్‌పై దాడి చేశారు.

 సంతోష్ రెడ్డి, వెంకట్‌రెడ్డి, రవికుమార్‌తో పాటు మరో ఆరుగురిని, ఐదుగురు అమ్మాయిలను అరెస్టు చేశారు. 11 మంది పారిపోయినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఫాంహౌస్‌ వాచ్‌మెన్‌ ప్రమోద్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఫాంహౌస్‌ పోలీసుశాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారిదని తెలిసింది. అక్కడున్న కొంతమంది ప్రముఖవ్యక్తులకు పోలీసులు వస్తున్నారనే ముందస్తు సమాచారం అందడంతోనే పరారైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios