ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తున్నా కూడా వ్యభిచార దందా మాత్రం  తమ పని తాము హాయిగా చేసుకుంటూ పోతున్నాయి. వైరస్ అంటే కొద్దిపాటి భయం కూడా లేకుండా.. విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ వ్యభిచార దందాను పోలీసులు రట్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... మహబూబ్‌నగర్‌కు చెందిన ఎ..శివకుమార్‌, కరీంనగర్‌కు చెందిన చిన్నా స్నేహితులు. వీరికి పశ్చిమ బెంగాల్‌, ముంబయి, ఇతర రాష్ట్రాల్లో అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసే ముఠాలతో పరిచయాలు ఉన్నాయి.

దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్న వారిద్దరు వ్యభిచారం చేయించాలనుకున్నారు. ఉద్యోగాల పేరుతో బ్రోకర్ల సాయంతో ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఇంట్లో ఉంచేవారు. 

అమ్మాయిల ఫోటోలను ఆన్‌లైన్లో పెట్టి విటులను ఆకర్షించేవారు. ఒక్కో కస్టమర్‌ నుంచి రూ. 5 వేల నుంచి 8 వేల వరకు వసూలు చేసి అమ్మాయిలను పంపించేవారు. ఈ వ్యభిచార దందాపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు. అమ్మాయిలు బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.