హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులతో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై హైదరాబాద్ పోలీసులు దాడి చేశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా బంజారాహిల్స్ లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఈ గలీజ్ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో దాడి చేసిన పోలీసులు ఇద్దరు సెక్స్‌ వర్కర్లతో పాటు నలుగురు విటులు, ఇద్దరు ఆర్గనైజర్లను అరెస్ట్ చేశారు. 

ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన మనోజ్‌ ప్రకాశ్‌ బాసి(40), రమేష్‌ పటేల్‌(24)లు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు. అయితే ఈజీ మనీ కోసం వారు వక్రమార్గం పట్టారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఆనంద్‌ బంజారా కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అత్యంత గుట్టుగా ఈ దందా నిర్వహిస్తున్నారు. 

ఈ వ్యభిచార దందాపై సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసిన పోలీసులు విటులు ప్రశాంత్‌గౌడ(28), గురు(30), లోకేష్‌గౌడ(32), అభిషేక్‌(27)లతో పాటు కొందరు అమ్మాలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇద్దరు ఆర్గనైజర్లను కూడా అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.