Asianet News TeluguAsianet News Telugu

కరోనా పరీక్షలు... వైద్య సిబ్బందిపై దాడి

వారికి వివరాలు చెప్పకపోగా.. మీకెందుకు చెప్పాలంటూ వారిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకునన పోలీసులు నిందితులను రిమాండ్ కి తరలించారు.

police arrest the persons who attacked on health workers in tanduru
Author
Hyderabad, First Published Apr 8, 2020, 9:08 AM IST

ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిపై దాడికి యత్నించిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ లో చోటుచేసుకుంది. పాత తాండూరు ప్రాంతంలోని కలాల్ గల్లీలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్న వారి ఆరోగ్య వివరాలు సేకరించడానికి ఏఎన్ఎం అంజిలమ్మ, ఆశా కార్యకర్తలు అరుణ వెళ్లారు.

కాగా... వారికి వివరాలు చెప్పకపోగా.. మీకెందుకు చెప్పాలంటూ వారిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకునన పోలీసులు నిందితులను రిమాండ్ కి తరలించారు.

కాగా.. కరోనా వైకస్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సర్వే చేపట్టారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే చికిత్స అందించాలనే ఉద్దేశంతో వారు  సర్వే చేయడానికి రాగా.. దాడి చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు తెలంగాణలో 400లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో కేవలం హైదరాబాద్ నగరంలోనే 170మంది కి సోకడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios