Asianet News TeluguAsianet News Telugu

వనపర్తి‌లో కొడుకు ముందే తండ్రిపై పోలీసుల దాడి ఘటన: కానిస్టేబుల్ సస్పెన్షన్

లాక్‌డౌన్ నేపథ్యంలో నిబంధనలకు విరుద్దంగా  రోడ్లపైకి వచ్చారని పదేళ్ల కొడుకు ముందే తండ్రిని కొట్టిన ఘటనలో ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనకు పాల్పడిన కానిస్టేబుల్ ఆశోక్ ను జిల్లా ఎస్పీ అపూర్వరావు సస్పెండ్ చేశారు. 

poice brutally attack on man in wanaparthy:constable Ashok suspended from services
Author
Wanaparthy, First Published Apr 2, 2020, 4:42 PM IST


వనపర్తి:లాక్‌డౌన్ నేపథ్యంలో నిబంధనలకు విరుద్దంగా  రోడ్లపైకి వచ్చారని పదేళ్ల కొడుకు ముందే తండ్రిని కొట్టిన ఘటనలో ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనకు పాల్పడిన కానిస్టేబుల్ ఆశోక్ ను జిల్లా ఎస్పీ అపూర్వరావు సస్పెండ్ చేశారు. 

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో  వనపర్తి పట్టణంలో పదేళ్ల కొడుకుతో ఓ వ్యక్తి రోడ్డుపైకి వచ్చాడు. నిబంధనలకు విరుద్దంగా రోడ్డుపైకి వచ్చావంటూ కొడుకు ముందే  కానిస్టేబుల్ ఆ వ్యక్తిని చితకబాదాడు.  ఈ సమయంలో తన తండ్రిని కొట్టొద్దంటూ ఆ బాలుడు పోలీసులను వేడుకొన్నాడు.

Also read:కొడుకు ముందే తండ్రిని కొట్టిన వనపర్తి పోలీసులు:రంగంలోకి కేటీఆర్

అంకుల్  వదిలిపెట్టండి అంటూ ప్రాధేయపడ్డాడు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. తండ్రిని విచక్షణరహితంగా కొట్టారు. తండ్రి కొడుకులను పోలీస్ వ్యాన్  ఎక్కించి తీసుకెళ్లారు.

ఈ దాడి దృశ్యాలను లక్ష్మణ్ అనే వ్యక్తి రికార్డు చేసి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డిజీపీ మహేందర్ రెడ్డిని  కోరారు. 

ఈ ఘటనపై డీజీపీ విచారణ చేయాలని వనపర్తి ఎస్పీ అపూర్వరావును ఆదేశించారు డీజీపీ మహేందర్ రెడ్డి. దీంతో ఎస్పీ  విచారణ జరిపారు. ఈ ఘటనకు కారణమైన ఆశోక్ ను సస్పెండ్ చేస్తున్నట్టుగా గురువారం నాడు మధ్యాహ్నం ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios