కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం తుమ్ము, దగ్గు, జ్వరం.. పక్కవారిని పట్టుకోవడం వంటి వాటివల్లే ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో దీనిని కట్టడి చేసేందుకు దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. ఒక వేళ పొరపాటున బయటకు వెళ్లాల్సి వస్తే... మూడడుగుల దూరం మొయింటైన్ చేయాలంటూ అధికారులు చెబుతున్నారు.

అయితే.. లాక్ డౌన్ మాటేమో గానీ.. సోషల్ డిస్టాన్స్ మాత్రం బాగానే పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. సోషల్ మీడియాలో ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో కల్లు అమ్మే వ్యక్తి... తన వద్దకు వచ్చిన వ్యక్తికి కల్లు అమ్ముతున్నాడు. కాగా... అది కూడా చేతికి అందించకుండా.. పైపులో కల్లు పోస్తుండటం గమనార్హం. ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. కనీసం మూడు అడుగుల దూరం మొయింటైన్ చేస్తూ కల్లు తాగుతున్నాడు. సోషల్ డిస్టాన్స్ పేరిట ఈ ఫోటో వైరల్ గా మారింది.

Also Read కరోనా భయం.. చివరి చూపుకి కూడా రాకుండా.....

ఇదిలా ఉండగా..భారత్ లోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. కొద్ది రోజలు క్రితం పదుల సంఖ్యలో ఉన్న కరోనా కేసులు ఇప్పుడు వందలకు చేరాయి. మరో రెండు, మూడు రోజుల్లో వేలల్లోకి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం 24గంటల్లో దేశంలో 149 కరోనా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ కేసులో ప్రస్తుతం భారత్ లో 873మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు.అదే విధంగా కోవిడ్‌-19 మరణాల సంఖ్య 19కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం వెల్లడించింది. కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. సామాన్య పౌరులు సహా అధికారులపై కొరడా ఝళిపిస్తున్నాయి. అదే విధంగా కష్టకాలంలో అత్యవసరంగా మారిన మాస్కులు, శానిటైజర్లను అధిక ధరలకు అమ్ముతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నాయి. 

కాగా.. అమెరికా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఒక్క రోజులోనే 1600లమందికి పైగా కరోనా సోకినట్లు గుర్తించారు. లక్ష మందికి పైగానే కరోనా సోకింది. మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.ఇక ప్రపంచవ్యాప్తంగా 24 వేలకు పైగా మంది కరోనా బారిన పడి మరణించగా... 5 లక్షలకు మందికి పైగా ఈ మహమ్మారి సోకిన విషయం తెలిసిందే