కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కాల్ సెంటర్ ఉద్యోగినులను మాయ చేసి ఆన్లైన్ వ్యభిచార కూపంలోకి లాగిన ముఠాను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా ముగ్గురిని రిమాండ్ కు తరలించారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ కథనం ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అన్నవరంకు చెందిన శివ అలియాస్ బడ్డి నగరంలో ఆన్లైన్ వ్యభిచార కలాపాలకు నాయకుడిగా ఉన్నాడు.

పోలవరం మండలం వెస్ట్ గోదావరికి చెందిన ఓబిలి శెట్టి సతీష్ అలియాస్ నాని(28), సూర్యాపేట జిల్లా పాల్కీడు మండలం వాసి రామ్ రామావత్ నాగేశ్వర్ అలియాస్ చరణ్ నాయక్ (30), మహబూబ్నగర్ జిల్లా నవాబ్ పేట మండలానికి చెందిన కరిడిగి మహేష్ గౌడ్ అలియాస్ మహేష్(31)లతో కలిసి ఏడాదిగా నగర శివారులోని నక్షత్ర విలాస్ లో ఉంటూ ఆన్లైన్లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.

దీనికోసం ప్రత్యేకంగా యాప్ లు పెట్టి కావలసిన వారికి యువతులను సమకూర్చుతున్నాడు. ముందుగానే నగదు వసూలు చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో బాలాపూర్ ఎస్ఐ నాగరాజు శివతో ఆన్లైన్లో సంప్రదించారు. యువతి కావాలని అడిగారు. సరేనని ఒప్పుకున్న శివ బేరం కుదుర్చుకుని, తన వాళ్లైన ముగ్గురితో యువతిని కారులో చెప్పిన చోటుకు పంపించాడు. 

ఆన్‌లైన్ యాప్‌లతో రూ. 11 వేల కోట్ల ఆర్జన: చార్జీషీట్‌లో పోలీసులు...

దీంతో అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అలా ఆన్లైన్ దందా గుట్టు రట్టు చేశారు. ఆ తరువాత నక్షత్ర విలాస్ కి వెళ్లి ఇద్దరు యువతులను రక్షించి.. విచారించగా లాక్ డౌన్ తో ఉద్యోగాలు కోల్పోయిన తమను ముఠా సభ్యులు వ్యభిచార కూపంలోకి దీంపారని తెలిపారు.

ఎంతమందిని ఇలా ఈ ఉచ్చులోకి లాగారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ప్రధాన నిందితుడు శివ పరారిలో ఉన్నాడు. యువతులను కూకట్పల్లిలోని హోమ్ కి తరలించారు.