హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠాగుట్టు రట్టు చేశారు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ మరియు ఎస్వోటీ పోలీసులు. గోవా నుంచి డ్రగ్స్ ను తీసుకువచ్చి విద్యార్థులకు అమ్ముతున్న ముగ్గురు సభ్యుల ముఠాను రామాంతపూర్ లో అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠాగుట్టు రట్టు చేశారు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ మరియు ఎస్వోటీ పోలీసులు. గోవా నుంచి డ్రగ్స్ ను తీసుకువచ్చి విద్యార్థులకు అమ్ముతున్న ముగ్గురు సభ్యుల ముఠాను రామాంతపూర్ లో అదుపులోకి తీసుకున్నారు.
నిందుతుల నుంచి 10 గ్రాముల హెరాయిన్, 15 ఎల్ ఎస్ డీ బ్లాట్స్, కేజీన్నర గంజాయి, ఒక సుజుకీ వాహనం, 3వేల రూపాయల నగదు, మూడు మెుబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మెుత్తం లక్షా యాభై వేల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.
నిందితులు రసూల్ పురాలో నివాసముంటున్న మహ్మద్ సమీద్, అత్తాపూర్ కు చెందిన ఉజైర్ అహ్మద్, రామాంతపూర్ కు చెందిన పుప్పల వెంకటేష్ లుగా పోలీసులు గుర్తించారు. మహ్మద్ సమీద్ కేరళలో చదువు కుంటున్న రోజుల్లోనే డ్రగ్స్ కు బానిసయ్యాడు. అలప్ప యూనివర్శిటీ ద్వారా బీబీఏ పూర్తి చేశాడు. సౌదీ అరేబియాలో 3నెలల పాటు ఉన్న అతను ఇండియాకు తిరిగి వచ్చాడు.
ఈ ఏడాది ఏప్రిల్ లో గోవా వెళ్లిన అతను అంజునా బీచ్ సమీపంలోని ఓ గెస్ట్ హౌస్ లో ఉన్నాడు. అక్కడ ఒకరి ద్వారా 20వేలకు 20 ఎల్ఎస్ డీ డ్రగ్స్ తీసుకున్నాడు. ఒక ఎల్ ఎస్ డీ డ్రగ్స్ తీసుకుని మిగిలినది ఉజైర్ అహ్మద్, పుప్పుల వెంకటేష్ లకు అమ్మి కేరళ వెల్లిపోయాడు. వివిధ ప్రాంతాల్లో జాబ్ నిమిత్తం తిరిగిన సమీద్ ఈనెలోలో హైదరాబాద్ చేరుకున్నారు.
బేగంపేట్ సమీపంలోని ఒక రూంలో ఉంటూ జాబ్ కోసం వెతుకుతున్నాడు. ఉజైర్ అహ్మద్ ప్రస్తుతం సెటి మేరిస్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఎంబీఏ చేస్తున్నాడు. మరో నిందితుడు పప్పుల వెంకటేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ విభాగంలో పీజీ చేయడంతోపాటు పీహెచ్ డీ కూడా చేశారు. ఈస్ట్ లండన్ లో మాస్టర్ ఇన్ మెుబైల్ కమ్యూనికేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం రైటర్ గా పనిచేస్తున్నారు.
ముగ్గురు నిందితులు హైదరాబాద్ లో తరచు కలుసుకుంటూ హిరాయిన్, ఎల్ఎస్ డీ బ్లాట్స్, వీడ్ అమ్మకాలు జరుపుతున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మరింత సమాచారం కోసం ఉప్పల్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈముగ్గురు నిందితులు ఉన్నత విద్యావంతులు కావడం గమనార్హం.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Sep 9, 2018, 1:13 PM IST