Asianet News TeluguAsianet News Telugu

టీనేజీలో ప్రేమ .. సోషల్ మీడియాలో గృహిణి నగ్న చిత్రాలు.. !!

టీనేజీలో ప్రేమ వ్యవహారం ఇప్పుడా యువతిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. సరదాగా తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ తీవ్రమానసిక వేదనకు గురి చేస్తున్నాయి. పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయురాలిని టీనేజీ ప్రేమ వేధింపులకు గురి చేస్తోంది. 

Nude photos of daughter on social media, mother pitition in highcourt, telangana - bsb
Author
Hyderabad, First Published Mar 23, 2021, 12:01 PM IST

టీనేజీలో ప్రేమ వ్యవహారం ఇప్పుడా యువతిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. సరదాగా తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ తీవ్రమానసిక వేదనకు గురి చేస్తున్నాయి. పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయురాలిని టీనేజీ ప్రేమ వేధింపులకు గురి చేస్తోంది. 

డెంటల్ కాలేజీలో చదివే రోజుల్లో తీసుకున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. వాటిని తొలగించాలని లేఖలు రాసినా ఆయా సంస్థలు స్పందించకపోవడంతో హైదరాబాదులో ఉన్న ఆమె తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రేమించుకునే సమయంలో ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి నగ్నచిత్రాలు తీసుకున్నాడని, ఆ తరువాత  8 నెలలకు వారిద్దరూ విడిపోయారని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు.

ప్రస్తుతం తన కుమార్తె ఐదేళ్ల బాబుతో ఆస్ట్రేలియాలో స్థిరపడిందని తెలిపారు. 2012లో ప్రేమికుడు ఈ ఫోటోలను సామాజిక మాధ్యమాలతో, పాటు ఇంటర్నెట్ లో పెట్టగా అప్పుడు ఫిర్యాదు చేయడంతో తొలగించారు. మళ్లీ తిరిగి 2019లో ఫోటోలు కనిపించాయని ఆమె అన్నారు. దీనిపై ట్విటర్, ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్, గూగుల్ లకు లేఖలు రాసినా స్పందించలేదని తెలిపారు.

మరోవైపు ఈ ఫోటోలను తాను సోషల్ మీడియాలో పెట్టలేదని ప్రేమికుడు చెబుతున్నాడని అన్నారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుల మీద ఫిర్యాదుకు సంబంధించి దర్యాప్తు ఏ దశలో ఉంది? నిందితులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.

అదే విధంగా గూగుల్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలకు కూడా నోటీసులు జారీ చేశారు. మాజీ స్నేహితుల వల్ల సమాచారం దుర్వినియోగం అవుతున్నప్పుడు గోప్యతకు తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

బాధితురాలి లేఖపై ఎందుకు చర్య తీసుకోలేదో కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొన్నారు. నిందితులపై చర్య తీసుకునేలా చూడాలని కోరుతూ కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ కు వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్ కు సూచిస్తూ విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios