సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వాణీనగర్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్  జరగలేదని ఎస్పీ ప్రకటించారు. బోయ్ ఫ్రెండ్‌తో కలిసి మైనర్ బాలిక గ్యాంగ్‌రేప్‌ జరిగినట్టుగా కట్టు కథ అల్లినట్టుగా పోలీసులు స్పష్టం చేశారు.

Also read:అమీనాబాద్ ఘటనలో ట్విస్ట్: బాయ్ ఫ్రెండ్ తో వెళ్లి బాలిక కట్టుకథ

ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం మైనర్ బాలిక  కన్పించకుండా వెళ్లిపోయింది.దీంతో బాలిక తల్లిదండ్రులు 100కు ఫోన్ చేయడంతో  పోలీసులు బాలిక ఉపయోగించిన సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా బాలికను గుర్తించారు.

Also Read: సంగారెడ్డి జిల్లాలో దారుణం: మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్, ప్రాణాలు కాపాడిన డయల్ 100

తనపై కారులో ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్‌కు ప్రయత్నించారని బాలిక చెప్పింది. బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించిన సమయంలో  గ్యాంగ్‌రేప్ జరగలేదని వైద్యులు తేల్చారు. దీంతో అసలు ఏం జరిగిందనే విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఈ కేసులో పోలీసులు మైనర్ బాలిక నుండి అసలు విషయాన్ని కనుగొన్నారు.

తన బోయ్‌ఫ్రెండ్‌తో కలిసి తాను సినిమాకు వెళ్లినట్టుగా పోలీసు  దర్యాప్తులో బాలిక వివరించింది.  బోయ్‌ఫ్రెండ్‌తో కలిసి సినిమాకు వెళ్లిన విషయం ఇంట్లో తెలిస్తే ఏం చేయాలనే దానిపై  అత్యాచారం నాటకం ఆడింది. 

సినిమా నుండి ఇంటికి వచ్చిన తర్వాత గ్యాంగ్ రేప్ నాటకం ఆడేందుకు అమీనాపూర్‌కు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో వదిలివెళ్లినట్టుగా బాలిక చెప్పారు.  మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి సినిమాకు వెళ్లిన దృశ్యాలను పోలీసులు సేకరించారు. సీసీటీవీ పుటేజీ దృశ్యాల్లో మైనర్ బాలిక బోయ్ ఫ్రెండ్ బైక్ పై సినిమా హాల్‌కు వెళ్లిన దృశ్యాలను పోలీసులు మీడియాకు అందించారు.

మైనర్ బాలికను సినిమాకు తీసుకెళ్లిన ఇంటి యజమాని కొడుకు సందీప్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా ఎస్పీ చెప్పారు.  తమను కూడ కూడ తప్పుదారి పట్టించిన మైనర్ బాలికపై కేసు నమోదు చేసే విషయమై ఆలోచన చేస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు.