21 యేళ్లు నిండితేనే ప్రవేశం.. పబ్ ల ముందు వెలుస్తున్న పోస్టర్లు.. అత్యాచార ఘటనతో అలర్టైన యాజమాన్యం..

అమ్నిషియా పబ్ రేప్ కేసు ఘటన తరువాత హైదరాబాద్ లోని పబ్ ల నిర్వాహకులు కాస్త అలర్ట్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 21యేళ్లు లోపు వారిని పబ్ లకు అనుమతించకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పబ్ ల బయట పోస్టర్లు అతికించారు. 

no entry for below 21 years old, hyderabad pubs ramp up vigil

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత హైదరాబాద్లోని పబ్ నిర్వాహకుల తీరులో కొంత మార్పు కనిపిస్తోంది. 21 ఏళ్లు నిండిన వారికే ప్రవేశం అంటూ పబ్ ల ముందు బోర్డులు వెలిశాయి. ఇటీవలే ఓ పబ్ నుంచి మైనర్ బాలికను కారులో ఎక్కించుకుని తీసుకు వెళ్లిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రముఖుల పిల్లలు ఈ కేసులో నిందితులుగా ఉండడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఘటన తర్వాత పబ్ సంస్కృతిపై బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు విమర్శలు కురిపించాయి.

ఈ పరిణామాలతో నిర్వాహకులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మేజర్ అయిన వారికి పబ్ లో ప్రవేశానికి అనుమతి ఉంటుంది. అందుకనే ఇరవై ఒక్క ఏళ్ల అంటూ పబ్ ల ముందు బోర్డు లు వెలిశాయి. 21 ఏళ్ల లోపు ఉన్నవారు ఒక్కరున్నా..  గ్రూప్, కుటుంబ పార్టీలకు పబ్ లు నో చెబుతున్నాయి. కొన్ని పబ్ లు పదేళ్ల లోపు పిల్లలను పెద్దలతో కలిసి లంచ్ పార్టీలకు అనుమతిస్తున్నాయి. 

కాకపోతే ఎక్కువ శాతం పబ్ లు పెద్దలకు మాత్రమే ప్రవేశం అన్న నిబంధనలు పాటిస్తున్నాయి. మే 27నాటి ఘటన తర్వాత పబ్ యజమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు.. ఎవరికీ అవకాశం ఇవ్వరాదని భావిస్తున్నట్లు ఓ పబ్ నిర్వాహకుడు తెలిపారు.  అందుకనే పెద్దలతో కలిసి వచ్చినా మైనర్ లను పబ్ లోపలికి అనుమతించడం లేదు. ఈ మేరకు పబ్ బయట బోర్డులు కూడా పెడుతున్నారు. 

జూబ్లీహిల్స్ పబ్ లో మరో అత్యాచారఘటన.. పుట్టినరోజని పార్టీకి పిలిచి యువతిపై...

ఇదిలా ఉండగా, జూన్ 17న హైదరాబాద్ లో మరో పబ్ రేప్ కేసు ఘటన వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్‌ పబ్‌లో మైనర్ గ్యాంగ్ రేప్ ఘటన తరువాత.. అలాంటి దారుణాలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ యువతిపై అత్యాచర ఘటన కలకలం రేపింది. ఇది కూడా ఓ పబ్ లో పార్టీ తరువాత జరగడం గమనార్హం. ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న 28 ఏళ్ల మహిళ మీద ఆమె ఇంట్లోనే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డారు. 

వివరాల్లోకి వెడితే.. ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న 28యేళ్ల యువతిని ఆమె స్నేహితుడు అత్యాచారం చేశాడు. ఆ రోజు అతని పుట్టినరోజు అని, పబ్ లో పార్టీ ఇస్తున్నానని చెప్పి ఓ పబ్ కి ఆహ్వానించాడు. దీంతో ఆమె ఆఫీసు తరువాత పబ్ కి వెళ్లింది. అక్కడ పార్టీ బాగానే జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ తలెత్తలేదు. ఆ తరువాత పబ్ పార్టీ అయిపోయాక.. రాత్రి 11.30 ప్రాంతంలో ఆమెను ప్రగతినగర్ లోని ఆమె ఇంటివద్ద దింపుతామని వారు చెప్పారు. ఆ తరువాత వారు ఆమెను కారులో ప్రగతినగర్ లోని ఆమె ఇంటి వద్ద దించారు. అయితే ఆమె.. వారిని లోపలికి రావాల్సిందిగా పిలిచింది. అలా ఇంట్లోకి వచ్చిన వారు అర్థరాత్రి దాటేవరకు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఆ తరువాత తెల్లవారుజాము 4.30గంటల ప్రాంతంలో వారిద్దరూ వెళ్లిపోయారు. యువతి 5 గంటలకు నిద్రలోకి జారుకుంది. 

అయితే, తన మీద ఎవరో పడుకున్నట్టుగా అనిపించడం, ప్రైవేట్ భాగాల్లో తీవ్రమైన నొప్పితో ఒక్కసారిగా మెలుకువలోకి వచ్చింది. చూస్తే.. కాసేపటి క్రితం తన ఇంట్లోనుంచి వెళ్లిపోయిన స్నేహితుడు తన మీద అత్యాచారం చేస్తున్నాడు. వెంటనే ఆమె ప్రతిఘటించడం మొదలు పెట్టింది. అయితే, అతను తన బలాన్నంతా ఉపయోగించి ఆమె మీద అత్యాచారం చేయడమే కాకుండా.. ‘నువ్వు నన్ను ఏమీ చేయలేవు’.. అంటూ బెదిరించాడు. 

అతని నుంచి ఎలాగే తప్పించుకున్న ఆ యువతి.. బాత్రూంలోకి పరిగెత్తి గడియపెట్టుకుంది. ఆ తరువాత రక్షించమంటూ కేకలు వేయడం ప్రారంభించింది. తన కొలిగ్స్ ను సహాయం కోసం అర్థిస్తూ కాల్స్ చేసింది. ఇది గమనించిన స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తరువాత బైటికి వచ్చిన ఆమె.. వెంటనే అక్కడ్నుంచి బయటపడి.. పోలీసులను ఆశ్రయించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios