Asianet News TeluguAsianet News Telugu

నీ గోర్లు, కిడ్నీలు ఎవడికి కావాలి.. ముందు రేవంత్‌ రెడ్డికి వెంట్రుకలివ్వు : కేటీఆర్‌కు ఎంపీ అర్వింద్ కౌంటర్

డ్రగ్ టెస్ట్‌కి తాను సిద్ధమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్‌కు కౌంటరిచ్చారు ఎంపీ ధర్మపురి అర్వింద్ . రేవంత్ వ్యాఖ్యలకు వెంట్రుకలు ఇస్తానని చెప్పావని.. ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. 

nizamabad bjp mp dharmapuri arvind counter to minister ktr
Author
First Published Dec 20, 2022, 8:25 PM IST

డ్రగ్ టెస్ట్‌కి తాను సిద్ధమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్‌కు కౌంటరిచ్చారు ఎంపీ ధర్మపురి అర్వింద్. నీ వెంట్రుకలు, నీ గోర్లు ఎవరికి కావాలని ఆయన ప్రశ్నించారు. నీ కిడ్నీలు ఎవరికీ కావాలి... నీకు డయాబెటిస్ వుందని అర్వింద్ వ్యాఖ్యానించారు. రేవంత్ వ్యాఖ్యలకు వెంట్రుకలు ఇస్తానని చెప్పావని.. ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. రేవంత్ సవాల్‌ని ఎందుకు స్వీకరించలేదని అర్వింద్ నిలదీశారు. 

బాధ్యత గల మంత్రిగా కేటీఆర్ మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తామని ఎందుకివ్వలేదని అర్వింద్ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఉచిత ఎరువుల హామీ ఏమయ్యాయని ఆయన నిలదీశారు. లవంగాలకు , తంబాకుకు తేడా తెలియని వ్యక్తి కేటీఆర్ అంటూ సెటైర్లు వేశారు. దర్యాప్తు సంస్థలు, కోర్టులు వాటి పని అవే చేస్తాయని అర్వింద్ పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్‌లో దోషి అని తేలితే జైలుకు వెళ్తుందని ఆయన జోస్యం చెప్పారు. 

ఈ వ్యవహారంపై మాజీ మంత్రి డీకే అరుణ కూడా స్పందించారు. మంత్రి కేటీఆర్‌కు సంస్కారం వుందా అని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్‌పై బండి సంజయ్‌ సవాల్‌కి 6 నెలలు దాటాక స్పందించడం సిగ్గుచేటన్నారు. నీ ఇష్టం వచ్చినప్పుడు వెంట్రుకలు, గోర్లు, రక్తం ఇవ్వడం కాదని ఆమె చురకలంటించారు. దర్యాప్తు సంస్థలకు కావాల్సినప్పుడు వాటిని తీసుకెళ్తారని డీకే అరుణ అన్నారు. 

ALso REad: డ్రగ్స్‌ టెస్ట్‌కి రెడీ.. రక్తం, కిడ్నీలేంటీ బొచ్చు కూడా ఇస్తా : బండి సంజయ్‌కి కేటీఆర్ సవాల్

అంతకుముందు మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ టెస్ట్ కోసం తన రక్తం, కిడ్నీ, బొచ్చు కూడా ఇస్తానని సవాల్ విసిరారు. తాను ఇక్కడే వుంటానని, డాక్టర్లను తీసుకురావాలని కేటీఆర్ పేర్కొన్నారు. క్లీన్‌చిట్‌తో బయటకు వస్తానని... మరి కరీంనగర్‌లో బండి సంజయ్ తన చెప్పుతో తాను కొట్టుకుంటాడా అని మంత్రి సవాల్ విసిరారు. బండి సంజయ్ మనిషా, పశువా అని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కాగా.. కొద్దిరోజుల క్రితం కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. తనకు పొగాకు నమిలే అలవాటు వుందంటూ చేసిన వ్యాఖ్యలకు సంజయ్ కౌంటరిచ్చారు. కేటీఆర్‌కు డ్రగ్స్ సేవించే అలవాటు వుందని, దమ్ముంటే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ఈ ట్విట్టర్ టిల్లు తాను పొగాకు నములుతానని అంటున్నాడని.. ఇది అబద్ధమన్నారు. కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస అని సంజయ్ ఆరోపించారు. తాను తన శరీరంలో రక్తం సహా ఏ శాంపిల్‌ అయినా టెస్టుల కోసం ఇవ్వడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. మరి తనలాగే కేటీఆర్ కూడా పరీక్షలకు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. అంతేకాకుండా హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసులను మరోసారి తిరగతోడాలని ఆయన డిమాండ్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios