Asianet News TeluguAsianet News Telugu

నల్గొండ పోలీసులు రెచ్చిపోయారు (వీడియో)

తమ సమస్య పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన గ్రామస్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. నిరసన కోసం గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న టెంట్ ని పోలీసులు కూల్చివేయడంతో ఆగ్రహించిన గ్రామ మహిళలు పోలీసులపై తిరగబడ్డారు. తమకు అండగా నిలబడి న్యాయం చేయాల్సిన పోలీసులే యాజ.మాన్యానిని కొమ్ముకాసి తమ ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారిని ఆవేధన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం ఎలికట్ట గ్రామ సమీపంలో ఓ కోళ్లఫారం ఉంది. అయితే గ్రామానికి అతిసమీపంలో ఇది ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఈగల బెడద ఎక్కువయ్యింది. దీంతో అక్రమంగా నిర్మించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న ఈ కోళ్లఫారంను వెంటనే తమ గ్రామానికి దూరంగా ఇతర ప్రాంతాలకు తరలించాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అయితే కోళ్లఫారం ఎదుట నిరసనకారులు వేసిన టెంట్ ను కూల్చేసిన పోలీసులుఆందోళనకారులను చెదరగొట్టారు. అయితే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కొళ్లఫారం యాజమాన్యంపై కాకుండా పోలీసులు తమపై దౌర్జన్యానికి దిగడం బాగోలుదని గ్రామస్తులు ఆవేధన వ్యక్తం చేశారు. ఆ యాజమాన్యానికి ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటంతోనే పోలీసులు వారిని ఏమీ చేయలేకపోతున్నారని తెలిపారు. ఈ కోళ్లఫారం వల్ల తమ ప్రానాలకు ముప్పు ఉందనపి కాబట్టి వెంటనే దీన్ని ఇక్కడినుండి తరలించాలని గ్రామస్తులు తెలిపారు. లేకపోతే ఈ ఆందోళన తీవ్రస్థాయిలోకి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.