Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ కొంప ముంచుతుందా: నిరంజన్ రెడ్డి వర్సెస్ జూపల్లి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు, మంత్రి నిరంజన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కొంప ముంచే విధంగానే ఉంది. రెబెల్స్ పై చర్యలు తీసుకోకపోవడం వెనక ఆంతర్యం ఏమిటనేది తెలియడం లేదు.

Municipal elections 2020: Niranjan Reddy vs Jupalli krishna Rao
Author
Hyderabad, First Published Jan 18, 2020, 8:06 PM IST

హైదరాబాద్: రాష్ట్రంలో ఆ మూడు నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మంత్రి వర్సెస్ మాజీ మంత్రి అన్న చందంగా ఎన్నికల్లో నేతలు విడిపోయారు రాజకీయాల్లో ఇద్దరు సుదీర్ఘ అనుభవం ఉన్న నేతలే కావడం ఇద్దరు అధికార పార్టీలోనే ఇప్పుడు కొనసాగుతుండడంతో ఆ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ల మధ్య ఆధిపత్య పోరుకు ఈ ఎన్నికలు తెరలేపాయని అధికార పార్టీలో టాక్ మొదలైంది. కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఐదుసార్లు విజయం సాధించి గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన తనకు బలాన్ని నిరూపించుకునేందుకు మున్సిపల్ ఎన్నికలే కీలకమని జుపల్లి ప్రణాళికలు అమలు చేస్తున్నారు.  

రాజకీయంగా సుధీర్హ అనుభవం ఉన్న నిరంజన్ రెడ్డి  తొలిసారి ఎమ్మెల్యే కావడంతో పాటు కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడంతో నిరంజన్ రెడ్డి వర్గం మాజీ మంత్రికి  ఈ ఎన్నికల్లో షాక్ ఇవ్వాలని పావులు కదుపుతోంది.

రెబల్స్ గా పోటీ చేస్తున్న నేతలపై పార్టీపరంగా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో కొల్లాపూర్,అలంపూర్, కల్వకుర్తి, నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులకు జూపల్లి వర్గానికి మధ్య ప్రధాన పోటీ గా మారింది.

తన అనుచరుల విజయం కోసం తెరవెనుక చక్రం తిప్పుతున్న జూపల్లి మెజారిటీ నేతలను గెలిపించుకుంటీనే పార్టీలో పట్టు ఉంటుందని లేదంటే రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయని పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే అదనుగా అధికార పార్టీ గా సీనియర్ మాజీ కి చెక్ పెట్టాలని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా ఆ మూడు నియోజకవర్గాల్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ అధికార పార్టీ అభ్యర్థుల విజయం కోసం పావులు కదుపుతున్నారు.దీంతో అభ్యర్థుల మధ్య పోటీ కంటే మాజీ మంత్రి  వర్సెస్ మంత్రి అన్న చందంగా ఆ మున్సిపాలిటీలో ఎన్నికలు మారాయి

Follow Us:
Download App:
  • android
  • ios