నల్లగొండ: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఓ మహిళ కన్నకొడుకును పొట్టన పెట్టుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కోపంతో ప్రియుడితో కలిసి కుమారుడిని హతమార్చింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లాలోని బుద్దారం గ్రామంలో చోటు చేసుకుంది. 

ప్రియుడితో కలిసి గొంతుకు టవల్ బిగించి కొడుకుని కడతేర్చింది. ఆ తర్వాత అతని శవాన్ని గోనెసంచీలో మూట కట్టింది. విషయం తెలిసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

విజయ అనే మహిళ తన తొమ్మిదేళ్ల కుమారుడు నాగరాజును హత్య చేసిన వైనం కలకలం రేపుతోంది. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

బాలుడి మెడపై ఉన్న గాయాలను పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.