Asianet News TeluguAsianet News Telugu

వివాదంలో మంత్రి మల్లారెడ్డి: టిక్కెట్ల కోసం డబ్బులు డిమాండ్, ఆడియో వైరల్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి మల్లారెడ్డి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కౌన్సిలర్ ‌, కార్పోరేటర్ టికెట్లను అమ్ముకున్నారని.. ఉద్యమకారులను విస్మరించి తన వర్గం వారికే టికెట్లు ఇచ్చారని కొందరు విమర్శిస్తున్నారు

More trouble for Minister Malla Reddy in telangana municipal elections
Author
Hyderabad, First Published Jan 19, 2020, 6:54 PM IST

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి మల్లారెడ్డి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కౌన్సిలర్ ‌, కార్పోరేటర్ టికెట్లను అమ్ముకున్నారని.. ఉద్యమకారులను విస్మరించి తన వర్గం వారికే టికెట్లు ఇచ్చారని కొందరు విమర్శిస్తున్నారు.

మరికొందరైతే ఆడియో రికార్డులను బయటపెట్టడంతో మల్లారెడ్డి మరింత ఇరుకునపడ్డారు. ముఖ్యంగా బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పోరేషన్‌లలోని టిక్కెట్ల వ్యవహారాలు ఆయన మెడకు చుట్టుకున్నాయి.

పీర్జాదిగూడలోని మొదటి నుంచి టీఆర్ఎస్‌లో ఉన్న దర్గా దయాకర్‌ను కాదని అధిష్టానం వెంకట్ రెడ్డికి మేయర్ అవకాశం కల్పించింది. దీంతో అలిగిన దయాకర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

పార్టీ మారిన గంటలోగా ఆయన ఇంటికి వెళ్లిన మల్లారెడ్డి రాయబారం నడిపి దయాకర్‌ను టీఆర్ఎస్‌లోకి కొనసాగేలా చేసి సక్సెస్ అయ్యారు. అయితే ఇంత చేసినా వెంకట్ రెడ్డి, దయాకర్ రెడ్డిల మధ్య రాజీ కుదర్చడంలో మాత్రం మంత్రి విఫలమయ్యారని సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి.

Also Read:మున్సిపల్ పోల్స్‌లో కానరాని లెఫ్ట్ అభ్యర్థులు

ఇక బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉద్యమకారులను కాదని డబ్బున్న వారికే మల్లారెడ్డి టిక్కెట్లు ఇప్పించారని కొందరు విమర్శిస్తున్నారు. రాపోలు రాములు అనే టీఆర్ఎస్ నేత ఏకంగా మల్లారెడ్డి మాట్లాడిన ఆడియో టేపులను బయటపెట్టారు. 

అక్కడితో ఆగకుండా తన వద్ద ఇంకా ఆధారాలున్నాయని మంత్రి బండారం బయటపెట్టి తీరుతామని రాములు తేల్చి చెప్పారు. ప్రముఖ ఛానెల్ ప్రసారం చేసిన ఈ ఆడియో ప్రస్తుతం తెలుగునాట వైరల్‌గా మారింది. 

తాజాగా బోడుప్పల్ మేయర్ అభ్యర్థిగా ఉన్న సంజీవ కుమార్ ఆడియో రికార్డింగ్ బయటపడింది. బోడుప్పల్ నుంచి టికెట్ ఆశించిన బొమ్మక్ మురళీ.. మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డితో మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణ ప్రస్తుతం కలకలం రేపుతోంది.

సదరు ఆడియో టేపులో ‘‘డబ్బు ఎక్కడికి తీసుకురావాలని మురళీ అడగ్గా.. ఇందుకు స్పందించిన రాజశేఖర్ రెడ్డి.. భద్ర అనే వ్యక్తితో మాట్లాడాలని చెప్పారు. తన వద్ద అతని నెంబర్ లేదని మురళీ చెప్పడంతో ఇప్పుడే తాను నెంబర్ ఎస్ఎంఎస్ చేస్తానని బదులిచ్చారు.

వైకుంఠ ఏకాదశి రోజున సంజీవ రెడ్డికి డబ్బు ఇవ్వమన్నారని, కానీ ఆయన చాలా బిజీగా ఉన్నారని మురళీ చెప్పారు. దీనికి స్పందించిన రాజశేఖర్ రెడ్డి.. భద్రా కుమారుడి నెంబర్‌ ఇస్తానని’’ బదులిచ్చారు. 

ఆ తర్వాత భద్రారెడ్డికి ఫోన్ చేసిన మురళీ ‘‘ తాను డబ్బు సిద్ధం చేసుకున్నానని, ఎక్కడికి తీసుకురమ్మంటే అక్కడికి వస్తానన్నారు. దీనిపై స్పందించిన భద్రారెడ్డి టికెట్‌ను మరొకరికి ఇచ్చినట్లు చెప్పారు. 

Also Read:కేసీఆర్ పై ఫైట్: తెలంగాణలోనూ బిజెపి ఆస్త్రం పవన్ కల్యాణ్

ఆ తర్వాత బొమ్మక్ మురళీ డైరెక్ట్‌గా మంత్రి మల్లారెడ్డికి కాల్ చేశారు. ‘‘ మురళీ అన్నా సారీ ఏమనుకోకు... మేడ్చల్ క్యాంప్ ఆఫీసుకు వస్తే టికెట్ కన్ఫార్మ్ అయిపోతుందని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నానని మురళీ చెప్పడంతో ఫంక్షన్ హాల్‌కు రావాల్సిందిగా మల్లారెడ్డి ఆదేశించారు. 

అనంతరంత సంజీవరెడ్డికి మురళీ ఫోన్ చేసి వాగ్వాదానికి దిగారు. తాను రూ.40 లక్షలు తీసుకొచ్చి ఇస్తానని, కానీ మీ వదిన రూ.50 లక్షలు ఇచ్చి టికెట్ దక్కించుకుందని మురళీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా మల్లారెడ్డి లోకల్ పొలిటిక్స్‌ను సరిగా హ్యాండిల్ చేయలేకపోవడంతో అధిష్టానం సీరియస్‌గా ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios