Asianet News TeluguAsianet News Telugu

నాలుగు సీట్ల కోసం రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు.. కర్నె ప్రభాకర్

ఉత్తమ్ అవివేకి లా చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారు.  హరీశ్ లేఖకు స్పందిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీఆర్ఎస్  నిర్ధారించిందని అడ్డగోలుగా ఉత్తమ్ మాట్లాడారు. 

mlc karne prabhakar fire on uttam and chandrababu
Author
Hyderabad, First Published Oct 11, 2018, 1:10 PM IST

తెలంగాణలో ఎన్నికల తేదీ ఖరారు కావడంతో.. రాజకీయాలు మరింత వేడిగా మారాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఎంఎస్ ప్రభాకర్ రావులు.. కాంగ్రెస్ నేత ఉత్తమ్ పై విరుచుకుపడ్డారు.

ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన వారు.. ఉత్తమ్ పై విమర్శల వర్షం కురిపించారు.  ఉత్తమ్ కుమార్ రెడ్డి అమరావతి నుంచి వచ్చిన స్క్రిప్టును చదివారని ఎద్దేవా చేశారు. టీడీపీ కి కట్టుబానిసలమని ఉత్తమ్ రుజువు చేసుకున్నారని ఆయన అన్నారు.విభజన హామీల అమలుకోసం టీఆర్ఎస్ ఎప్పట్నుంచో కేంద్రాన్ని అడుగుతోందని గుర్తు చేశారు.

‘‘మా మంత్రి హరీశ్ రావు సంధించిన 12 ప్రశ్నలపై ఉత్తమ్ డొంక తిరుగుడు సమాధానమిచ్చారు. నదీ జలాల పంపకం పై ఉత్తమ్ కు కనీస అవగాహన లేదని తేలిపోయింది. సైన్యం లో కెప్టెన్గా పనిచేశానని చెప్పుకునే ఉత్తమ్ కు కనీస పరిజ్ఞానం లేదు. నదీ జలాల విషయం లో రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు వస్తే పరిష్కరించడానికి అపెక్స్ బాడీ ఉంది . ఆ అపెక్స్ బాడీ ముందు చంద్రబాబు తెలంగాణ నీటి కేటాయింపులకు ససేమిరా అన్నారు. ఉత్తమ్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు కు వత్తాసు పలికాడు.  అన్ని అనుమతులున్న సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డుపడుతున్నాడు. ఉత్తమ్ దాన్ని సమర్దిస్తున్నాడు. ఉత్తమ్ అవివేకి లా చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారు. 
హరీశ్ లేఖకు స్పందిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీఆర్ఎస్  నిర్ధారించిందని అడ్డగోలుగా ఉత్తమ్ మాట్లాడారు. ఉత్తమ్ పగటి కలలు కంటున్నారు.’’ అని కర్నే ప్రభాకర్ అన్నారు.

‘‘ చంద్రబాబు ఎజెండా నే కాంగ్రెస్ ఎజెండా అని ఉత్తమ్ చెప్పకనే చెప్పారు. అపుడు ఆంధ్రా కాంగ్రెస్ నేతల మోచేతి కింద నీళ్లు తాగారు. ఇపుడు చంద్రబాబు మోచేతి కింద నీళ్లు తాగుతున్నారు.  తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కు తాకట్టు పెట్టే కుతంత్రాల కూటమే మహాకూటమి. తెలంగాణ ప్రజల కోసమే ఆ అపవిత్ర కూటమి ని ఎండగడుతున్నాం. తెలంగాణ ప్రజలు మహాకూటమి కి సరయిన సమాధానం చెబుతారు. ప్రజలకు మహాకూటమి ప్రాతిపదికలు చెప్పాలి .కేవలం నాలుగు సీట్లు గెలవడం కోసం రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.

అనంతరం ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ...హరీశ్ రావు లేఖ పై ఉత్తమ్ స్పందించిన తీరు ఆయన మెచ్యూరిటీ ఏ స్థాయి లో ఉన్నది రుజువు చేసిందన్నారు. ఒక్క ప్రశ్నకు కూడా ఉత్తమ్ సరిగా స్పందించలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ కు ఓ ఎజెండా ,కార్యక్రమం ఏమి లేదని మండిపడ్డారు. కెసిఆర్ ,చంద్రబాబు భేటీ మీద మాట్లాడుతున్న ఉత్తమ్ రాహుల్ ,మోడీ ఆలింగనం ఎందుకో చెప్పాలి అని డిమాండ్ చేశారు. మోడీ కూడా పాకిస్తాన్ వెళ్లి నవాజ్ షరీఫ్ ను కలిశారని గుర్తు చేశారు.  భేటీలు వేరు ..రాష్ట్ర ప్రయోజనాలు వేరని స్పష్టం చేశారు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios