దారుణం: మామ అని నమ్మితే రేప్ చేసి చంపేశాడు

Minor girl 'raped, murdered' by labourer in Telangana
Highlights

సోన్ లో మైనర్ బాలికపై అత్యాచారం, హత్య


నిర్మల్: నిర్మల్ జిల్లా సోన్ గ్రామంలో దారుణం చోటు చేసుకొంది. పదేళ్ళ బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. నిందితుడిని పోలీసుుల అరెస్ట్ చేశారు. 

తెలిసిన వ్యక్తే పదేళ్ళ బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేసి హత్య చేశాడు. నిందితుడిని మృతురాలు  మామయ్య అంటూ పిలిచేది. తెలిసిన వ్యక్తే అని ఆ బాలిక అతడి వెంట వెళ్ళింది. అయితే ఆ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత తనకు ఏమీ తెలియనట్టుగానే ఆ దుర్మార్గుడు వ్యవహరించాడు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగు చూడడంతో బాలిక మృతదేహం ఎక్కడుందనే విషయాన్ని బయటపెట్టాడు.


నిర్మల్ జిల్లా సోన్ గ్రామానికి చెందిన  తోకల ప్రవీణ్ అనే యువకుడు  అదే గ్రామానికి చెందిన పదేళ్ళ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. మోటార్ బైక్ పై ఆ బాలికను తీసుకెళ్ళాడు.  కూచన్ పల్లిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి పాపపై అత్యాచారం చేశాడు. తన  పేరును ఆ బాలిక బయటపెడుతుందనే ఉద్దేశ్యంతో ఆ బాలికను రాయితో కొట్టి చంపేశాడు.

అయితే ఈ బాలిక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రచారం నిర్వహించారు. అయితే సోన్ గ్రామానికి చెందిన కొందరు యువకులు ప్రవీణ్ , గణేష్ ఈ బాలికను మోటార్ బైక్ పై తీసుకెళ్ళిన విషయాన్ని  పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ప్రవీణ్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తే అసలు విషయం వెలుగు చూసింది. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకొన్నాడు.

loader