ఓ మైనర్ బాలుడు 300మంది యువతుల నగ్న వీడియోలను మొబైల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ లోని మాదాపూర్ లో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. మాదాపూర్ కి చెందిన ఓ మైనర్ బాలుడు తన కుటుంబంతో కలిసి.. ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పక్కనే నివసిస్తున్నాడు. కాగా.. ఎవరూ చూడకుండా హాస్టల్ లోని బాత్రూమ్ లో ఆ మైనర్ బాలుడు కెమేరాను అమర్చాడు. దాని సహాయంతో 300 మంది యువతులు స్నానం చేస్తుండగా.. వీడియోలు చిత్రీకరించాడు.

కాగా.. ఈ విషయాన్ని ఆ హాస్టల్ యువతులు ఆలస్యంగా గుర్తించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ మైనర్ బాలుడిని అరెస్టు చేశారు