తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ కొడంగల్ లో పర్యటించారు. ఆయనతోపాటు సహచర మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా కొడంగల్ పర్యటనలో ఉన్నారు. పట్నం సోదరుడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి కూడా వెళ్లారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ కార్యకర్తలతో జరిగిన సభలో జూపల్లి కృష్ణారావు హాట్ కామెంట్స్ చేశారు. గాడిదను, గుర్రాన్ని ఒకే గాట కట్టొద్దని హితవు పలికారు. మాయమాటలు చెప్పి మోసం చేసేవారు ఎవరు? పనిచేసేవారు ఎవరో గుర్తు పట్టాలంటూ కార్యకర్తలకు హితబోధ చేశారు. జూపల్లి ఇంకేమన్నారో కింద వీడియోలో చూడండి.