హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెపై హత్యాయత్నం చేశాడు ఈ సంఘటన హైదరాబాదులోని కూకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. 

తెలిసిన వ్యక్తి పిలువడంతో ఆమె అతనితో వెళ్లింది. ఆమెను అతను ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బండారాయితో తలపై మోది ఆమెను చంపాలని ప్రయత్నించాడు ఆమె జననాంగంపై గాయాలుచేసఆడు. 

స్పృహ కోల్పోయిన మహిళ రాత్రంతా అక్కేడ పడి ఉంది. మరునాడు మెలుకువ రావడంతో పుట్టింటికి చేరుకుంది. ఓ 50 ఏళ్ల మహిళ భర్తతో విడిపోయి తల్లితో కలిసి మూసాపేటలో ఉంటోంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. గతంలో మూసాపేట యాదవబస్తీలో ఉన్నప్పుడు పక్కింట్లో ఉండే సెంట్రింగ్  మేస్త్రీ లుకలాపు రాము (38)తో ఆమెకు పరిచయం ఏర్పడింది 

ప్రతి రోజూ కూలీ పనులకు వెళ్లి మూసాపేట మీదుగా ఇంటికి వెళ్లేది. ఈ విషయం పసిగట్టిన రాము శుక్రవారం సాయంత్రం ఆమెను మూసాపేట నరసింహస్వామి ఆలయం వద్ద ఆపి తాను కూడా తాను అటువైపే వోస్తున్నానని, తన టూవీలర్ మీద తీసుకుని వెళ్తానని చెప్పాడు. తెలిసినవాడు కావడంతో ఆమె అతని వాహనంపై కూర్చుంది. 

ఆ తర్వాత ఆమెను రాఘవేంద్ర సొసైటీ సమీపంలోని చెట్లపొదల్లోకి బలవంతంగా తీసుకుని వెళ్లాడు. ఆమెపై అక్కడ అత్యాచారం చేశాడు. బండరాయితో ఆమె తలపై మోదాడు. దాంతో ఆమె ముఖంపై గాయాలయ్యాయని. ఆమె జననాంగంపై తీవ్రమైన గాయాలు చేశాడు. దాంతో ఆమె చనిపోయిందని భావించిన రాము అక్కడి నుంచి పరారయ్యాడు. 

తెల్లారి మెలుకువ వచ్చి చూసుకుంటే ఒంటిపై దుస్తులు సరిగా లేవు. మెల్లాగా ఆమె సమీపంలోని తన ఇంటికి చేరుకుంది. తల్లి సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. దాంతో 108 వాహనంలో పోలీసుుల ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాము కుటుంబంతో సహా పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం కొసమాల గ్రామానికి చెందినవాడు. 14 ఏళ్ల క్రితం హైదరాబాదు వచ్చి మూసాపేటలో ఉంటున్నాడు.