ఇద్దరు దంపతుల మధ్య జరిగిన గొడవ.. ఆ ఇంటి యజమాని ప్రాణం తీసింది. భార్య మీద కోపాన్ని ఇంటి యజమాని మీద చూపించాడు. దీంతో... అతను ప్రాణాలు పోయాయి. ఈ దారుణ సంఘటన నిజామాబాద్  జిల్లా ఆర్మూర్ లో చోటుచేరసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  గోల్ బంగ్లా ప్రాంతానికి  చెందిన గిర్మాజీ రాజేందర్(40) అనే వ్యక్తి  తన సొంత  ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి టీవీ చూస్తున్నాడు. ఆయన ఇంట్లోని ఓ పోర్షన్ ఓ జంటకు ఆయన అద్దెకు ఇచ్చాడు. కాగా.. ఆ అద్దె ఇంట్లో ఉన్న భార్య భర్తలు తరచూ గొడవ పడుతూ ఉండేవారు. తాజాగా... ఆ దంపతులు మరోసారి గొడవ పడ్డారు.

ఆ భార్యభర్తల గట్టిగా అరుచుకుంటూ ఉండటంతో... టీవీ సరిగా వినపడం లేదని  రాజేందర్ భావించాడు. వెంటనే టీవీ సౌండ్ పెంచాడు. అసలే భార్యతో గొడవపడుతున్న కోపంలో ఉన్న బాలనర్సయ్య.. టీవీ సౌండ్ మరింత పెరగడంతో మరింత కోపోద్రిక్తుడయ్యాడు. 

Also Read దివ్య హత్యకు వెంకటేష్ ప్లాన్స్ ఫెయిల్, వేములవాడలోనే కత్తి కొనుగోలు: పోలీసులు...

భార్యమీద ఉన్న కోపాన్నంతా తీసుకెళ్లి ఇంటి యజమాని రాజేందర్ పై చూపించాడు. కోపంగా వెళ్లి రాజేందర్ తలపై గట్టిగా ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు రాజేందర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 

వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు నర్సయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.