వికారాబాద్: తెలంగాణలోని వికారాబాదులో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. జిల్లాలోని కులకచర్ల మండలం లాల్ సింగ్ తండాలో ఆ దారుణం చోటు చేసుకుంది. స్నానం చేస్తున్న అమ్మాయిలను, వివాహిత మహిళలను ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఓ కామాంధుడు. 

నగ్నంగా ఉన్న పొటోలను బయపెడుతానంటూ అమ్మాయిలను, మహిళలను బెదిరిస్తున్నాడు. వారిని బ్లాక్ మెయిల్ చేసి లోబరుచుకుంటున్నాడు. ఆ తర్వాత ఆ ప్రైవేట్ వీడియోలను మిత్రులకు పంపిస్తూ క్రూరంగా వ్యవహరిస్తున్నాడు. 

ఓ మహిళా బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసుుల గత నెల 18వ తేదీన శ్రీనివాస్ అనే ఆ కామాంధుడిపై కేసు నమోదు చేశారు. అయితే, నాలుగు రోజుల క్రితం అతను బెయిల్ మీద విడుదలయ్యాడు. అతను తన సోదరుడితో కలిసి బాధితురాలి కుటుంబ సభ్యులపై దాడికి దిగాడు. 

పైగా వారిపైనే అక్రమ కేసులు పెట్టించాడు. శ్రీనివాస్ కు పోలీసులు అండగా నిలుస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. శ్రీనివాస్ మీద ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థులు ఆందోళనకు దిగారు. శ్రీనివాస్ వల్ల గ్రామంలో అశాంతి నెలకొందని అంటూ అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.