మమత కాలేజీ విద్యార్థినితో దొంగ ఓట్లు (వీడియో)
Dec 8, 2018, 1:05 PM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు దొంగఓట్లు వేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో శుక్రవారం టీడీపీ, టీఆర్ఎస్ నేతలకు ఈ విషయంలో చిన్న వాగ్వాదమే జరిగింది. ఖమ్మంలోని 206, 206ఏ, 207 పోలింగ్ కేంద్రంలో 3వేల ఓటర్లు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది మమత మెడికల్ కళాశాల ఓటర్లు ఉన్నారని, ఈ పేరుతో కొందరు దొంగ ఓట్లు వేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మమత కళాశాలకు చెందిన విద్యార్థులతో అభ్యర్థి దొంగ ఓట్లు వేయమన్నారని నేరుగా పట్టుబడిన విద్యార్థులే చెప్పారని నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. దొంగ ఓటు వేసిన విద్యార్థి టీడీపీ నేతలతో మాట్లాడుతుండగా వీడియో కూడా తీశారు. తనది దొంగ ఓటని ఆ విద్యార్థిని అంగీకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ వీడియోని టీడీపీ శ్రేణులు... సోషల్ మీడయాలో షేర్ చేయగా.. విపరీతంగా వైరల్ గా మారింది. మరి దీనిపై టీఆర్ఎస్ నేతలు ఏమంటారో చూడాలి. విద్యార్థి మాట్లాడిన వీడియో.. మీరు ఇక్కడ చూడొచ్చు.