హైదరాబాద్:  కొల్లూరు తండాలో సామూహిక అత్యాచారం, హత్యకు గురైన మహిళ కేసులో పోలీసులు కీలక విషయాలను దర్యాప్తులో గుర్తించారు. 

శుక్రవారం నాడు ఈ హత్య కేసుకు సంబంధించిన విషయాలను పోలీసులు చెప్పారు.మహిళలపై గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసినట్టుగా పోలీసులు తెలిపారు. మహిళను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్  చేశారని పోలీసులు ప్రకటించారు. 

రెండు రోజుల క్రితం కొల్లూరు తండాకు చెందిన మహిళ అదృశ్యమైందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరిపితే అసలు విషయం వెలుగు చూసింది.

also read:షాకింగ్.. హైదరాబాద్ లో మహిళపై అత్యాచారం, హత్య

మాయ మాటలతో ముగ్గురు యువకులు ఆమెను తీసుకెళ్లి రేప్ చేశారని మాదాపూర్ డీసీపీ వెంటేశ్వర్లు తెలిపారు. బాధితురాలిపై అత్యాచారం చేసే సమయంలో తలకు గాయమైందని పోలీసులు చెప్పారు.

రేప్ చేసిన తర్వాత బాధితురాలు స్పృహ కోల్పోయినట్టుగా తెలిపారు. స్పృహలో లేని సమయంలో ఆమెను హత్య చేసినట్టుగా తమ విచారణలో వెల్లడైందని పోలీసులు చెప్పారు.ఈ ఘటనకు పాల్పడిన నిందితులను రామచంద్రాపురం అరెస్ట్ చేశారు.