Asianet News TeluguAsianet News Telugu

బ్యూటీ సెలూన్ పేరిట వ్యభిచార దందా..!

ప్రధాన నిర్వహాకుడితోపాటు ఇద్దరు మేనేజర్లు, 10మంది విటులు, 10మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు.

Madhapur Police Burst Sex Rocket in Beauty Saloon
Author
Hyderabad, First Published Sep 6, 2021, 9:10 AM IST

బ్యూటీ సెలూన్ పేరిట వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ లో చోటుచేసుకుంది. వ్యభిచార గృహంపై ఆదివారం సాయంత్రం ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. 

స్పా సెంటర్, బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వహాకుడితోపాటు ఇద్దరు మేనేజర్లు, 10మంది విటులు, 10మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి రూ.73వేల నగదు, 28 మొబైల్ ఫోన్లు, ఓ కారు, రూ.4లక్షలు బ్యాలెన్స్ ఉన్న బ్యాంకు ఖాతాను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios