యాదాద్రి: తెలంగాణలోని భువనగిరి యాదాద్రి జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. ప్రియుడి పిలిచాడని వెళ్లిన యువతి దారుణ హత్యకు గురైంది. వలిగొండలో యువతి శ్రీవాణి అదృశ్యం, హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మిరియాల రవిని, చిన్నపాక రవితేజను నిందితులుగా పోలీసులు గుర్తించారు. 

ఈ నెల 18వ తేదీన శ్రీవాణి తల్లితో పాటు వలిగొండకు వెళ్లింది. ప్రియుడు మిరియాల రవి పిలువడంతో శ్రీవాణి వలిభాష గుట్ట వద్దకు వెళ్లింది. శ్రీవాణితో అనుమానంతో ఆమెను చంపాలని పథకం వేసుకున్నాడు రవి. దాన్ని ఆచరణలో పెట్టాడు. 

శ్రీవాణిని హత్య చేసేందుకు రవి తన మిత్రుడు రవితేజను సహాయం కోరాడు. రవిపై నమ్మకంతో వచ్చిన శ్రీవాణిపై వలిభాష గుట్ట వద్ద అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను చంపేశాడు. 

అదే రోజు భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి శివారులో మిరియాల రవి కూడా అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ స్థితిలో ఈ నెల 29వ తేదీన అనుమానంతో రవితేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా వాస్తవాలు బయటపడ్డాయి.