యాదాద్రి సెక్స్ రాకెట్: వ్యభిచార గృహాలకు తాళాలు, ఆ కాలనీలన్నీ నిర్మానుష్యం

latest updates on yadadri Sex Racket
Highlights

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. వివిధ ప్రాంతాల నుండి చిన్నారులను కిడ్నాప్ చేసి వారిని వ్యభిచార గృహాలకు తరలిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించి, చిన్నారులకు విముక్తి కలిగించిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు గత మూడు రోజులుగా ఆపరేషన్ ముస్కాన్ పేరుతో వ్యభిచార గృహాలపై దాడులు చేస్తూ అందులో మగ్గుతున్న చిన్నారులను కాపాడుతున్నారు. ఇప్పటివరకు ఇలా 15 మంది చిన్నారులను కాపాడటమే కాకుండా 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. వివిధ ప్రాంతాల నుండి చిన్నారులను కిడ్నాప్ చేసి వారిని వ్యభిచార గృహాలకు తరలిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించి, చిన్నారులకు విముక్తి కలిగించిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు గత మూడు రోజులుగా ఆపరేషన్ ముస్కాన్ పేరుతో వ్యభిచార గృహాలపై దాడులు చేస్తూ అందులో మగ్గుతున్న చిన్నారులను కాపాడుతున్నారు. ఇప్పటివరకు ఇలా 15 మంది చిన్నారులను కాపాడటమే కాకుండా 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 

దీంతో యాదగిరి గుట్టలోని సెక్స్ గృహాల నిర్వహకులు భయపడిపోతున్నారు. తమ ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోతున్నారు. దీంతో ఎప్పుడూ సెక్స్ వర్కర్లు, విటులతో సందడిగా ఉండే ప్రాంతాలన్ని ప్రస్తుతం నిర్మానుష్యంగా మారిపోయాయి. వారు ఎక్కువగా నివాసముండే కాలనీల్లోని ఇళ్లన్నీ ఇపుడు తాళాలు వేసే కనిపిస్తున్నాయి. మరికొంత మంది రోజంతా వేరే ప్రాంతాల్లో ఉంటూ రాత్రి సమయాల్లో తమ ఇళ్లకు చేరుకుంటున్నారు.  ఇప్పటివరకు దొరికిన నిందితులపై పిడి యాక్టు, పీటా యాక్టు నమోదు చేస్తుండటంతో మిగతావారు పోలీసులకు దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు.

అయితే ఈ వ్యభిచార గృహాల దాడుల ద్వారా అత్యంత భయంకరమైన విషయాలు బైటికివచ్చాయి. చిన్నారులను ప్రత్యేక వైద్య పద్దతుల ద్వారా పడుపు వృత్తి కోసం రెడీ  చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేకంగా చిన్నారులకు ఆక్సిటోసిన్ వంటి శారీరక ఎదుగుదల మందులు ఇంజక్ట్ చేసి పడుపు వృత్తిలోకి లాగుతున్నారు. ఇలా వ్యభిచార గృహ నిర్వహకులు చిన్నారులను శారీరకంగానూ, మానసికంగానూ వేధనకు గురిచేసి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. 

అయితే ఈ చిన్నారులను తమ పిల్లలతో పాటు పెంచుకుంటున్న నిర్వహకులు, సమాజానికి కూడా తమ పిల్లలుగానే పరిచయం చేశారు. వారికి తమ కుటుంబ సభ్యులుగా పేర్కొంటూ రేషన్ కార్డులో చేర్చుకోవడం, ఆధార్ కార్డులు తీసుకోవడం చేశారు. వీటి ఆధారంగానే స్కూళ్లలో కూడా జాయిన్ చేశారు. అయితే పోలీసుల దాడులతో ఒక్కసారిగా ఈ పిల్లలను కిడ్నాప్ చేసి తీసుకువచ్చారని తెలిసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

ఇప్పటివరకు వ్యభిచార గృహాల నుండి 15 మంది చిన్నారులను పోలీసులు కాపాడారు. అయితే ఇంకా కొంతమంది చిన్నారులు వారి వద్దే ఉన్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెక్స్ వర్కర్లు, నిర్వహకులు తమ పిల్లలుగా చెబుతున్న చిన్నారులు కూడా కిడ్నాప్ చేసి తీసువచ్చిన వారే అయివుంటారని భావిస్తున్న అధికారులు వారిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. 

యాదగిరి గుట్టలోని సెక్స్ వర్కర్లు నివాసముండే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్లను ఐసీడీఎస్‌ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులు కాపాడిన చిన్నారుల వివరాలతో పాటు మిగతా విద్యార్థుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. అడ్మిషన్ రిజిస్టర్ తో పాటు వారు సమర్పించిన దృవీకరణ పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు. వీరిలో కూడా చాలా మంది వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని, తండ్రి పేరు లేకుండా కేవలం తల్లి పేరుతో నమోదై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ పిల్లలు నిజంగానే నిర్వహకుల పిల్లలా లేక ఇంతకుముందు దొరికినట్లే కిడ్నాపైన పిల్లాల అన్న కోణంలో విచారణ సాగుతోంది. 

 

సంబంధిత వార్తల కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి

https://telugu.asianetnews.com/telangana/yadagirigutta-sex-rocket-remembers-mahanadi-movie-pcxlne

https://telugu.asianetnews.com/telangana/rachakonda-dcp-press-meet-on-yadadri-operation-muskan-pcvkpg

https://telugu.asianetnews.com/telangana/yadadri-operation-muskan-details-pcvj7e

loader