Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ పెడ్లర్ టోని సహా ఏడుగురు వ్యాపారుల అరెస్ట్: రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

డ్రగ్స్ పెడ్లర్ టోని రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. హైద్రాబాద్ లో ఓ హోటల్ రూమ్ ను అద్దెకు తీసుకొని టోని డ్రగ్స్ సరఫరా చేసేవాడని గుర్తించారు.

key information in Drug peddler tony remand report
Author
Hyderabad, First Published Jan 21, 2022, 12:36 PM IST

హైదరాబాద్: దేశంలోని పలు నగరాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న  Tony సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన కేసులో  రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు.Mumbai  లోని అంథేరిలో ఉన్న టోనిని  పోలీసులు అరెస్ట్ చేసి Hyderabad కు తీసుకొచ్చారు. టోని సహా హైద్రాబాద్ కు చెందిన ఏడుగురు వ్యాపారులను కూడా పోలీసులు Drugs తీసుకొన్నందుకు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ సమయంలో పోలీసులు Remand Report లో కీలక విషయాలను ప్రస్తావించారు.

డ్రగ్స్ Peddler టోని 60 మంది యువకులతో కలిసి డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారని police రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పోలీసులకు చిక్కకుండా టోని హైద్రాబాద్ కు డ్రగ్స్ ను తరలించేవాడని పోలీసులు తెలిపారు. హైద్రాబాద్ లోని ఓయో హోటల్  రూమ్ ను అద్దెకు తీసుకొని డ్రగ్స్ ను సరఫరా చేసేవాడని పోలీసులు  రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

వ్యాపారులకు గ్రాము కొకైన్ ను రూ. 20 వేలకు టోని విక్రయించేవాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. గత నాలుగేళ్లుగా టోని వద్ద వ్యాపారులు డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

15 రోజులకు ఒకసారి ముంబై బ్యాచ్ ని  టోని  హైదరాబాద్ కు పంపిస్తున్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.టోనీ కి  నమ్మకం ఉన్న 60 మంది యువకుల చేత డ్రగ్స్  వ్యాపారం. నిర్వహిస్తున్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.

నాలుగు సంవత్సరాల నుంచి  వ్యాపారవేత్త నిరంజన్ జైన్ పెద్ద మొత్తంలో డ్రగ్స్ వాడుతున్నాడు.30 సార్లు టోనీ దగ్గర్నుంచి   నిరంజన్ జైన్ డ్రగ్స్  తేప్పించుకున్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ  నిరంజన్ జైన్ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడని పోలీసులు చెప్పారు.పలు ప్రభుత్వ ప్రాజెక్టు పనులను నిరంజన్ కాంట్రాక్టు తీసుకొన్నాడు.నిరంజన్ జైన్ ఇచ్చే పార్టీలో కూడా ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

పాత బస్తీ కేంద్రం గా నడుస్తున్న  మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. మసాలా దినుసుల తో  ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఆనంద్ కూడా ఈ కేసులో అరెస్టయ్యాడు.

మూడు సంవత్సరాల నుంచి టోనీ  గ్యాంగ్ చేత డ్రగ్స్  తెప్పించుకొంటున్నాడు ఆనంద్ అనే వ్యాపారి.ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శాశవత్ జైన్  కూడా డ్రగ్స్  తీసుకొంటున్నాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు చెప్పారు. హైదరాబాదు తో పాటు ఆంధ్రా లో పెద్ద ఎత్తున రియల్ వ్యాపారాలు చేస్తున్న శాశవత్ జైన్.శంషాబాద్ లోని వందల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న జైన్.తెలుగు రాష్ట్రాల్లో లో eta  surf  ను  జైన్ పరిచయం చేశాడు.ప్రముఖ కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్ రెడ్డి అరెస్ట్ చేశారు. పలు ప్రభుత్వ కాంట్రాక్టర్లను చేపట్టిన సూర్య సుమంత్ రెడ్డి.నిరంజన్ జైన్,  సుమంత్ రెడ్డి కలిసి హైదరాబాదులో బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు.

ప్రముఖ వ్యాపారి బండి భార్గవ్ అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పలు కాంట్రాక్టులను  బండి భార్గవ్ నిర్వహిస్తున్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వివరించారు.  ప్రముఖ ఎగుమతుల, దిగుమతుల వ్యాపారి వెంకట్ చలసాని కూడా డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. ఆంధ్ర తెలంగాణలో ప్రముఖ ఎక్స్‌పోర్ట్  వ్యాపారిగా చలసాని వెంకట్ కు పేరుంది. భార్గవ్ , వెంకట్ లు కలిసి పార్టనర్స్ గా ఎగుమతుల వ్యాపారం చేస్తున్నారని ఆ రిపోర్టులో పోలీసులు వివరించారు.

భార్గవ్,  వెంకట్ కలిసి  హైదరాబాద్ లోని అంతర్జాతీయ స్కూల్లో చదువుకొన్నారని రిపోర్టులో పోలీసులు తెలిపారు. వెంకట్ చలసాని తండ్రి పెద్ద కాంట్రాక్టరు.వ్యాపారవేత్త తమ్మినేని సాగర్ ను కూడా అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ముంబై డ్రగ్ మాఫియా డాన్ టోనీ తో  సాగర్ కు  సంబంధాలున్నాయని చెప్పారు.

టోని ద్వారా వ్యాపారవేత్తలు నిరంజన్ కుమార్ జైన్, శాషవత్ జైన్, యోగనాంద్ అగర్వాల్, దండు సూర్యసుమంత్ రెడ్డి, బండి భార్గవ్,వెంకట్ చలసాని, తమ్మినేని సాగర్, అల్గాని శ్రీకాంత్,  సుబ్బారావులను డ్రగ్స్ కొనుగోలు చేసేవారని పోలీసులు గుర్తించారు. టోని సహా వీరిని గురువారం నాడు  అరెస్ట్ చేశారు.  మరో నలుగురు వ్యాపారుల పేర్లను కూడా త్వరలోనే వెల్లడిస్తామని హైద్రాబాద్  సీపీ  సీవీ ఆనంద్  చెప్పారు. 

బెంగుళూరు, ముంబైలలో డ్రగ్స్ సరఫరాకు ప్రత్యేక గ్యాంగ్ లు ఏర్పాటు చేసుకొని  టోని డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సీవీ ఆనంద్ తెలిపారు. తాత్కాలికమైన వీసా, పాస్‌పోర్టు తో టోని ఇండియాకు వచ్చి డ్రగ్స్ దందా నడుపుతున్నాడని సీవీ ఆనంద్ చెప్పారు. టోనీ వీసా, పాస్‌పోర్ట్ గడువు తీరిన తర్వాత కూడా రహస్యంగా ముంబైలో తలదాచుకొంటున్నట్టుగా సీవీ ఆనంద్ తెలిపారు.

టోని ప్రధాన అనుచరుడు ఇమ్రాన్ బాబు షేక్ ను గతంలోనే అరెస్ట్ చేసినట్టుగా సీవీ ఆనంద్ గుర్తు చేశారు.  ఇమ్రాన్  అరెస్ట్ చేసిన విషయం తెలియగానే టోని తన వాట్సాప్ చాటింగ్ ను డిలీట్ చేశారని సీవీ ఆనంద్ చెప్పారు. 2013లో  నైజీరియా నుండి టోని ఇండియాకు వచ్చారన్నారు. ముంబైలోని ఈస్ట్ అంథేరిలో నివసిస్తున్నాడని ఆనంద్ వివరించారు.

డ్రగ్స్ తీసుకొనే వారిని అరెస్ట్ చేయకపోతే కట్టడి చేయలేమన్నారు సీపీ. డ్రగ్స్ తీసుకొన్నా, విక్రయించినా వారి మూలాలను వెలికితీస్తామని సీవీ ఆనంద్ హెచ్చరించారు.హైద్రాబాద్ లో డ్రగ్స్ తీసుకొంటున్న వారిలో వ్యాపారులు, రాజకీయ నేతల పిల్లలు, సినీ పరిశ్రమకు చెందిన వారున్నారని ఆనంద్ తెలిపారు.హైద్రాబాద్ నగరంలో సుమారు 300 మంది డ్రగ్స్ ఉపయోగిస్తున్నారని తమ వద్ద సమాచారం ఉందని చెప్పారు.వ్యాపారవేత్తలు, ఆఫీస్ బాయ్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకొన్నారని సీపీ చెప్పారు. సినీ రంగంలో వారికి ఇకపై డ్రగ్స్ కేసులో మినహాయింపులుండవని ఆయన తేల్చి చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios