యువతిని నమ్మించి మోసం చేసిన కేసులో కరణ్ కాన్సెప్ట్స్ అధినేత  చెరుకు కరణ్ రెడ్డిని గురువారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరణ్ రెడ్డి ఓ పార్టీ మీడియా ప్రచార బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు. 

బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ కళింగరావు కథనం ప్రకారం తార్నాక ప్రాంతానికి చెందిన ఓ యువతితో ఫేస్ బుక్ లో ఏర్పడిన పరిచయం ద్వారా నమ్మించి మోసం చేసిన సంఘటనలో చెరుకు కరణ్ రెడ్డితో పాటు ఆయన భార్య మానసరెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. 

పెళ్లి చేసుకుంటానని.. యువతిని అన్ని రకాలుగా వాడుకుని, చివరికి...

ఈ ఘటనలో యువతనికి మోసం చేసిన కరణ్ రెడ్డిని గురువారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన భార్య పరారీలో ఉందని అన్నారు. బాధిత యువతి ఇప్పటికే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని ప్రాథమికంగా విచారించారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్ పెక్టర్ తెలిపారు.