Asianet News TeluguAsianet News Telugu

దిశకు పేరేంట్స్‌తో సఖ్యత లేదు.. అందుకే చెల్లికి ఫోన్: కామారెడ్డి జడ్పీ‌ ఛైర్‌పర్సన్ వ్యాఖ్యలు

శంషాబాద్ హత్యాచార బాధితురాలు దిశపై కామారెడ్డి జెడ్పీ ఛైరపర్సన్ శోభ వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. గెజిటెడ్ ర్యాంకులో ఉన్న దిశకు ఆపద సమయంలో పోలీసులకు ఫోన్ చేయాలని తెలియదా అని ప్రశ్నించారామె.

kamareddy zp chairperson shobha controversial comments on disha
Author
Hyderabad, First Published Dec 11, 2019, 5:28 PM IST

శంషాబాద్ హత్యాచార బాధితురాలు దిశపై కామారెడ్డి జెడ్పీ ఛైరపర్సన్ శోభ వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. గెజిటెడ్ ర్యాంకులో ఉన్న దిశకు ఆపద సమయంలో పోలీసులకు ఫోన్ చేయాలని తెలియదా అని ప్రశ్నించారామె. తల్లిదండ్రులతో సఖ్యత లేకనే దిశ చెల్లికి ఫోన్ చేసిందని శోభ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

రాష్ట్రంలో దిశలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని ప్రభుత్వం ఆపాలంటే సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. ప్రతీది సర్కారుపై రుద్దితే ఎలా అని శోభ ప్రశ్నించారు. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. 

Also read:దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్: రిటైర్డ్ జడ్జితో విచారణకు సుప్రీంకోర్టు మెుగ్గు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశపై రేప్, హత్య ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రిటైర్డ్ జడ్జితో విచారించేందుకు సుప్రీం కోర్టు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

దిశ పై రేప్, హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన ఘటనపై ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దిశ హత్యాచార ఘటనలో నిందితులను కాల్చి చంపి ఎన్ కౌంటర్ గా చిత్రీకరిస్తున్నారంటూ ప్రజాప్రయోజన వాజ్యంలో స్పష్టం చేశారు. 

దిశ నిందితులను కాల్చి చంపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ లు న్యాయ స్థానాలను కోరారు. పిల్ పై బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. 

ఎన్ కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. ఢిల్లీలోనే ఉంటూ ఆయన ఈ కేసును దర్యాప్తు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందులో భాగంగా మాజీ జస్టిస్ పీవీరెడ్డిని సంప్రదించామని అయితే అందుకు ఆయన నిరాకరించారని తెలిపారు. 

Also Read:దిశ కేసు: ఇద్దరు కాదు... ముగ్గురూ మైనర్లేనా..?

దర్యాప్తుపై సలహాలు, సూచనలతో రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు తెలిపారు. తెలంగాణ హైకోర్టులో కూడా కేసు విచారణ కొనసాగుతుందని బోబ్డే స్పష్టం చేశారు. అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios